CM Jagan : 11 నియోజకవర్గాల ఇంచార్జ్ లను మార్చిన జగన్..

వైసీపీ అధినేత , సీఎం జగన్ (Jagan) కీలక నిర్ణయం తీసుకున్నారు. 11 నియోజకవర్గాల ఇంచార్జ్ (Incharge of Constituencies) లను మార్చారు. ఏపీ(AP) లో మరో మూడు నెలల్లో ఎన్నికలు (Assembly Elections 2024) రాబోతున్నాయి. ఈ క్రమంలో గెలుపు ఫై మరింత ఫోకస్ చేసారు. గతంతో పోలిస్తే ఈసారి ఎన్నికలు చాల టాప్ గా ఉండబోతున్నాయి. రీసెంట్ గా తెలంగాణ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కు భారీ షాక్ ఇచ్చారు రాష్ట్ర […]

Published By: HashtagU Telugu Desk
YCP Third List

Ycp Incharge Of Constituenc

వైసీపీ అధినేత , సీఎం జగన్ (Jagan) కీలక నిర్ణయం తీసుకున్నారు. 11 నియోజకవర్గాల ఇంచార్జ్ (Incharge of Constituencies) లను మార్చారు. ఏపీ(AP) లో మరో మూడు నెలల్లో ఎన్నికలు (Assembly Elections 2024) రాబోతున్నాయి. ఈ క్రమంలో గెలుపు ఫై మరింత ఫోకస్ చేసారు. గతంతో పోలిస్తే ఈసారి ఎన్నికలు చాల టాప్ గా ఉండబోతున్నాయి. రీసెంట్ గా తెలంగాణ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కు భారీ షాక్ ఇచ్చారు రాష్ట్ర ప్రజలు..పదేళ్ల పాటు అనేక సంక్షేమ పథకాలు అందజేసి..రాష్ట్రాన్ని ఎంతగానో అభివృద్ధి చేసిన కేసీఆర్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ఈ క్రమంలో ఏపీలో ప్రజలు ఎలాంటి ఫలితం ఇస్తారో అని ముందే జగన్ జాగ్రత్తపడుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

పార్టీ ఫై , అక్కడి నేతలపై వ్యతిరేకత ఉన్న నియోజకవర్గాల ఫై మరింత ఫోకస్ చేసారు. ఈ క్రమంలో 11 నియోజకవర్గాల ఇంచార్జ్ లను మార్చారు. ప్రత్తిపాడు-బాలసాని కిషోర్ కుమార్, కొండేపి- ఆదిమూలపు సురేశ్, వేమూరు- వరికూటి అశోక్ బాబు, తాడికొండ- సుచరిత, సంతనూతలపాడు-మేరుగ నాగార్జున, చిలకలూరిపేట- మల్లెల రాజేష్, గుంటూరు పశ్చిమ- విడదల రజినీ సహా పలువురిని మార్చినట్లు మంత్రి బొత్స ప్రకటించారు. పార్టీ అధినేత జగన్ నిర్ణయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

అలాగే మంగళగిరి వైసీపీ ఇన్‌ఛార్జి (Mangalagiri YCP New Incharge)గా గంజి చిరంజీవి (Ganji Chiranjeevi)ని నియమించారు. సోమవారం ఉదయం మంగళగిరి ఎమ్మెల్యే పదవికి, పార్టీకి ఆళ్ల రామకృష్ణారెడ్డి (Alla Ramakrishna Reddy) రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో పార్టీ కి , ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు రామకృష్ణ తెలిపారు. దీంతో జగన్.. మంగళగిరి వైసీపీ ఇన్‌ఛార్జిగా గంజి చిరంజీవిని నియమించారు.

Read Also : Ganji Chiranjeevi : గంజి చిరంజీవికి కీలక పదవి అప్పగించిన జగన్

  Last Updated: 11 Dec 2023, 08:52 PM IST