Site icon HashtagU Telugu

Andhra Pradesh : ప్రత్తిపాడులో వైసీపీకి ఎదురుదెబ్బ.. టీడీపీలో చేరిన వైసీపీ ఎంపీపీలు

TDP

TDP

కాకినాడ జిల్లా, ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు టీడీపీ గూటికి చేరారు. ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి, రౌతులపూడి ఎంపీపీ గంటిమళ్ల రాజ్యలక్ష్మీ, భద్రవరం ఎంపీటీసీ కొప్పుల బాబ్జీ, తూర్పులక్ష్మీపురం సర్పంచ్ వీరంరెడ్డి సత్యనాగభార్గవితో పాటు పలువురు వైసీపీ నేత‌లు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శ నారా లోకేష్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి  నారా లోకేష్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ప్రత్తిపాడులో ఈసారి టీడీపీ భారీ మెజార్టీతో గెలవాలని ఈ సందర్భంగా లోకేష్ అన్నారు. నాలుగున్నరేళ్లుగా వైసీపీ ప్రభుత్వ విధానాలు తమకు నచ్చడం లేదని, ప్రత్తిపాడులో ఈసారి టీడీపీ విజయదుందుభి మోగిస్తుందని పార్టీలో చేరిన నేతలు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ పార్లమెంట్ అధ్యక్షుడు జ్యోతుల నవీన్, ప్రత్తిపాడు నియోజకవర్గం ఇంఛార్జ్ వరుపుల సత్యప్రభ రాజా, నియోజకవర్గం ముఖ్య నేతలు పాల్గొన్నారు.

\Also Read:  YCP MP : ప్ర‌జా ధ‌నాన్ని చంద్ర‌బాబు లూటీ చేశారు : వైసీపీ ఎంపీ భ‌ర‌త్‌