నేడు అసెంబ్లీ(Assembly)లో టీడీపీ(TDP), వైసీపీ(YCP) ఎమ్మెల్యేల మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది. చంద్రబాబు అరెస్ట్(Chandrababu Arrest) అంశం ఏపీ రాజకీయాల్లో రోజు రోజుకి మరింత వేడిని పెంచుతుంది. ఇక చంద్రబాబుకి ప్రాణహాని ఉందని అరెస్ట్ అయిన దగ్గర్నుంచి పలువురు టీడీపీ నాయకులు అంటూనే ఉన్నారు. నారా లోకేష్(Nara Lokesh) కూడా తాజాగా చంద్రబాబుకి ప్రాణహాని ఉందని అన్నారు.
నారా లోకేష్ వ్యాఖ్యలపై వైసీపీ బాపట్ల ఎంపీ నందిగం సురేష్ బాబు(YCP MP Nandigam Suresh) సంచలన కామెంట్స్ చేసాడు.
నందిగం సురేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుపై సానుభూతి కోసం టీడీపీ ప్రయత్నాలు చేస్తుంది. ఎవరికి భయపడనని చెప్పే చంద్రబాబు, దోమలకు భయపడతారా?. చంద్రబాబు ప్రాణాలకు ప్రమాదం లోకేష్ , టీడీపీ నేతల నుంచే ఉంది. చంద్రబాబు లాగే వెన్నుపోటు విద్య లోకేష్ కు అబ్బినట్టుంది. చంద్రబాబు పదవి కోసం లోకేష్ ఇలా వ్యవహరించే అవకాశం కూడా ఉంది. చంద్రబాబు పై ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్న వారి ఫోన్లు చెక్ చేయాలి అని అన్నారు.
ఇవాళ అసెంబ్లీలో బాలకృష్ణ మీసం మెలేస్తూ వైసీపీ నాయకులపై ఫైర్ అయిన సంగతి తెలిసిందే. దీంతో నందిగం సురేష్ బాలకృష్ణ గురించి మాట్లాడుతూ.. అసెంబ్లీలో బాలకృష్ణ చేష్టలు దారుణం, వీళ్ళు ప్రజా నాయకులా?. బాలకృష్ణ గతంలో మెంటల్ అని సర్టిఫికెట్ తెచ్చుకున్నాడు. పిచ్చోళ్లకు ఎన్నికల్లో పోటీచేసే అర్హత లేదు. మెంటల్ బాలకృష్ణపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తాం. వారం రోజుల నుంచి ఢిల్లీలో ఉన్న లోకేష్ ఏపీకి ఎందుకు పోవడం లేదు. దొడ్డిదారిన ఎమ్మెల్సీగా గెలిచి మంత్రి పదవులు అనుభవించిన లోకేష్ దోపిడీకి పాల్పడ్డాడు అని వ్యాఖ్యానించారు. దీంతో సురేష్ లోకేష్ పై చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.