టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ స్పందించారు. విధి నిర్ణయానికి కాల నిర్ణయానికి ఎవరు అతీతులు కాదని.. అందుకు ఉదాహరణ నిన్న జరిగిన చంద్రబాబు సంఘటనేన్నారు. స్వర్గీయ ఎన్టీ రామారావు ఆత్మ ఈ సంఘటనతో సంతోషిస్తుందని మోపిదేవి వెంకటరమణ అన్నారు. 74 సంవత్సరాల వయస్సులో ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి చంద్రబాబు నాయుడు కారణమయ్యారన్నారు. అడ్డదారుల్లో ముఖమంత్రి అయిన వ్యక్తి చంద్రబాబు అని.. 74 సంవత్సరాల వయస్సులో చంద్రబాబు జైలు పాలయ్యాడన్నారు. 23 నెంబర్ బాబుకు బాగా కలిసి వచ్చినట్లు ఉందని మోపిదేవి ఎద్దేవా చేశారు.ఈ కేసులో తరువాత ఎపిసోడ్ లోకేష్, అచ్చం నాయుడుదేనన్నారు. ఇకపై ప్రతిరోజు ఒక ఎపిసోడ్ చూస్తారని.. ఇప్పటి వరకు చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ వచ్చారని తెలిపారు. ఆధారాలతో సహా చంద్రబాబు తప్పు చేసినట్లు రుజువైనప్పటికీ ప్రతిపక్షాలు బాబుకు ఏమీ తెలియదనటం అవివేకమన్నారు. రాజధాని నిర్మాణంలో జరిగిన లావాదేవీలలో ఇన్కమ్ టాక్స్ లో 118 కోట్ల రూపాయలు చేతులు మారాయని.. గత 40 సంవత్సరాల చంద్రబాబు పొలిటికల్ ఇండ్రస్టీల్లో అంతా అవినీతేనన్నారు.
YCP MP Mopidevi : ఇక టీడీపీకి ప్రతిరోజు సినిమా చూపిస్తాం : ఎంపీ మోపిదేవి

YCP MP