Site icon HashtagU Telugu

AP Liquor Case : వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ఏ క్షణమైనా అరెస్టు చేసే ఛాన్స్..?

Ycp Mp Mithun Reddy Arrest

Ycp Mp Mithun Reddy Arrest

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసు(AP Liquor Case)లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి (YCP MP Mithun Reddy ) పేరు తెరపైకి రావడంతో రాజకీయంగా కలకలం రేగింది. ఈ కేసులో మిథున్ రెడ్డిని విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సమన్లు జారీ చేసింది. తాజా సమాచారం మేరకు మిథున్ రెడ్డి ఈరోజు ఉదయం 9.30కి ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని, 10 గంటలకు సిట్ కార్యాలయానికి హాజరుకానున్నారు. విచారణ అనంతరం పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఆయనను అరెస్ట్ చేసే అవకాశముందని వార్తలు వస్తున్నాయి.

CPI Leader Chandu Nayak : చందునాయక్ హత్య వెనుక మాజీ మావోయిస్టు రాజేష్ పాత్ర ఉందా..?

ఇదిలా ఉంటే.. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు నిన్న సిట్ అనుమతి కోరగా, ఈ మేరకు మరిన్ని ఆధారాలు, సమాచారం సమర్పించాలని ఏసీబీ కోర్టు సూచించింది. దీంతో తాత్కాలికంగా అరెస్ట్ దశకు ఆలస్యం అయినా, విచారణలో నేర సంబంధం స్పష్టమైతే అరెస్ట్ చేసే అవకాశాన్ని పోలీసులు పూర్తిగా విస్మరించలేదని అంటున్నారు. గతంలో జరిగిన లిక్కర్ అవకతవకల నేపథ్యంలో మిథున్ పై ఆరోపణలు వచ్చాయి.

ఇప్పటికే ఈ కేసులో పలువురు అధికారులపై విచారణ కొనసాగుతుండగా, రాజకీయ నేతల చేరికతో కేసు మరింత పుంజుకుంటోంది. మిథున్ రెడ్డి విచారణలో ఇచ్చే సమాధానాలపై ఆధారపడి భవిష్యత్ చర్యలు ఉంటాయని పోలీసులు అంటున్నారు. రాజకీయంగా స్పూర్తిదాయకమైన ఈ కేసులో ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాల్సిందే.