Gorantla Madhav Video: వైసీపీ ఎంపీ `న‌గ్న దృశ్యాల‌` న‌గుబాటు

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధ‌వ్ అశ్లీల వీడియో సోష‌ల్ మీడియా వేదిక‌గా హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

  • Written By:
  • Updated On - August 4, 2022 / 12:27 PM IST

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధ‌వ్ అశ్లీల వీడియో సోష‌ల్ మీడియా వేదిక‌గా హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఆయ‌న న్యూడ్ శ‌రీరాన్ని ఒక మ‌హిళ‌కు ప్ర‌ద‌ర్శిస్తోన్న వీడియో అది. వాట్స్ అప్ వీడియో కాల్ ద్వారా ఆయ‌న ఒక మ‌హిళ‌తో న‌గ్నంగా మాట్లాడుతున్న‌ట్టు ఉన్న వీడియో ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌కంప‌న లేపుతోంది. రెండు రోజులుగా సోషల్ మీడియా వేదిక‌గా ఉమామ‌హేశ్వ‌రి ఆత్మ‌హ‌త్య‌పై ప‌లు ర‌కాల పుకార్ల‌తో టీడీపీ, వైసీపీ సోష‌ల్ మీడియా టీమ్ రెచ్చిపోయింది. ఇప్పుడు గోరంట్ల మాధ‌వ్ న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న వీడియో రాజ‌కీయాన్ని సంత‌రించుకుంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆశ్లీల వీడియో వెనుక టీడీపీ నేతల కుట్ర ఉందని హిందూపురం ఎంపీ మాధ‌వ్ ఆరోపిస్తున్నారు. మార్ఫింగ్‌ చేసి ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని చెబుతున్నారు. ఈ విషయమై ఎస్పీకి, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా ఎంపీ మాధవ్ వివరించారు. ఈ కుట్ర వెనుక టీడీపీకి చెందిన చింతకాయల విజయ్, పొన్నూరి వంశీ, శివకృష్ణలున్నారని ఆరోపించారు. తనపై కుట్ర పన్నిన ముగ్గురిపై పరువు నష్టం దావా వేస్తానని ఎంపీ గోరంట్ల మాధవ్ చెప్పారు.

తనను అప్రతిష్టపాలు చేసేందుకు కుట్రలు పన్నార‌ని మాధ‌వ్ చెబుతున్నారు. వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి టెస్టుకు సిద్దమ‌ని స‌వాల్ విసిరారు. ఓ వీడియోలో ఉన్నట్టుగా తనను మార్పింగ్ చేశారని ఆయన ఆరోపించారు. ధైర్యముంటే నేరుగా ఎదుర్కోవాలని టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. అశ్లీల వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసి డ్యామేజీ చేయాలని చూస్తున్నారని ఎంపీ ఆగ్ర‌హించారు. వీడియో వెనుక వాస్తవాలను తేల్చాలని పోలీసులను కోరాన‌ని వెల్లడించారు.

వీడియోపై ప్రెస్ కౌన్సిల్ , హైకోర్టు, సుప్రీంకోర్టులలో కూడా పిల్ దాఖలు వేస్తాన‌ని ఎంపీ ప్ర‌క‌టించారు. ఈ వీడియోలో ఉన్నది తానేనని నిరూపిస్తే తల నరుక్కొంటానని ఛాలెంజ్ విసిరారు.. ఈ వీడియో ఆధారంగా కథనాలు ప్రసారం చేసిన చానెల్ పై ప్రెస్ కౌన్సిల్ కు కూడా ఫిర్యాదు చేస్తానని హెచ్చ‌రించారు. నగ్నంగా ఓ మహిళతో మాట్లాడుతున్నట్టుగా వీడియోను మార్ఫింగ్ చేశారని ఎంపీ వివ‌రించారు. ఈ వీడియో అస‌లా? నకిలీనా? అనేది తేల్చాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో ఈ వీడియో చక్కర్లు కొడుతున్న విషయమై విపక్షాలు మండిపడుతున్నాయి. విచారణ చేసి ఎంపీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయ‌డంతో రాజ‌కీయం హీటెక్కింది.