Gorantla Challenges Chandrababu: చంద్రబాబుకు ఎంపీ ‘గోరంట్ల’ఛాలెంజ్

సోషల్ మీడియాలో న్యూడ్ వీడియోను ప్రసారం చేస్తూ బీసీ వర్గానికి చెందిన ఎంపీని అవమానించేలా టీడీపీ ప్రయత్నించిందని వైఎస్సార్సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ శుక్రవారం అన్నారు.

Published By: HashtagU Telugu Desk
Gorantla And Naidu

Gorantla And Naidu

సోషల్ మీడియాలో న్యూడ్ వీడియోను ప్రసారం చేస్తూ బీసీ వర్గానికి చెందిన ఎంపీని అవమానించేలా టీడీపీ ప్రయత్నించిందని వైఎస్సార్సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ శుక్రవారం అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన టాలీవుడ్ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్త్రీద్వేషపూరిత వ్యాఖ్యలపై ఎందుకు చర్చలు జరపడం లేదని ఏబీఎన్, టీవీ5, ఈటీవీ యాజమాన్యాలను ప్రశ్నించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విదేశీ మహిళల ఫొటోలను చూపిస్తూ.. చర్చలు ఎందుకు నిర్వహించడం లేదని ఎంపీ గోరంట్ల అదే న్యూస్‌ ఛానళ్లను ప్రశ్నించారు.

“నేను కాణిపాకం ఆలయాన్ని సందర్శించి, న్యూడ్ వీడియో తనది కాదు అని దేవుడి ముందు ప్రమాణం చేస్తాను” అని గోరంట్ల పేర్కొన్నారు. ఓటుకు నోటు కుంభకోణంలో తన పాత్ర లేదని కాణిపాకం ఆలయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. లేకుంటే చంద్రబాబు తన (గోరంట్ల) వీడియో ఫేక్ అని ప్రజల ముందు ఒప్పుకోవాలి. నా వీడియో ఒరిజినల్ అని చంద్రబాబు నిరూపిస్తే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని గోరంట్ల అన్నారు.

  Last Updated: 19 Aug 2022, 07:14 PM IST