వైసీపీ లో గత కొద్దీ నెలలుగా రాజీనామాల పరంపర కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ హయాంలో కీలక పదవులు అనుభవించిన వారి దగ్గరి నుండి కింది స్థాయి నేతల వరకు వరుస పెట్టి పార్టీకి గుడ్ బై చెపుతూ బయటకు వస్తున్నారు. తాజాగా విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) సైతం రాజీనామా చేయడం జరిగింది. విజయసాయి బాటలోనే వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి అయోధ్య రామిరెడ్డి (Ayodhya Rami Reddy) రాజీనామా(Resign) చేయబోతున్నట్లు వార్తలు వైరల్ గా మారాయి. ఈ వార్తలు చూసి అంత నిజమే కావొచ్చని భావించారు. కానీ రాజీనామా వార్తలపై అయోధ్య రామిరెడ్డి క్లారిటీ ఇచ్చారు.
Virat Kohli Fans: విరాట్ కోహ్లీ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ఎందుకంటే?
వైసీపీకి, తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారనే వార్తలను రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి ఖండించారు. కొన్ని రోజులుగా తన రాజీనామా వార్తలు చర్చనీయాంశంగా మారడంతో, గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న అయోధ్య రామిరెడ్డి ఈ విషయంపై స్పష్టతనిచ్చారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు స్పందించిన అయోధ్య రామిరెడ్డి.. “ఇది పూర్తిగా తప్పుడు ప్రచారం. ఇప్పటికే ఈ వార్తలను ఖండించాను” అని చెప్పారు. వైసీపీతో తనకు ఎలాంటి విభేదాలు లేవని, పార్టీ పట్ల తాను నిబద్ధత కలిగి ఉన్నానని స్పష్టం చేశారు. కొన్ని రోజులుగా అయోధ్య రామిరెడ్డి విదేశాల్లో ఉండడంతో ఆయనపై వస్తున్న వార్తలకు సమాధానం చెప్పేందుకు వీలుకాలేదు. అయితే ఇప్పుడు తిరిగి వచ్చిన వెంటనే విలేకరులతో మాట్లాడి అన్ని అనుమానాలకు తెరదించారు. వైసీపీ పట్ల తనకు పూర్తి విశ్వాసం ఉందని అయోధ్య రామిరెడ్డి చెప్పుకొచ్చారు. తనపై వస్తున్న తప్పుడు ప్రచారాన్ని పట్ల రాజీ పడబోమని స్పష్టం చేశారు.