Site icon HashtagU Telugu

YCP : పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన వైసీపీ ఎంపీ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అక్క‌డ నుంచే పోటీ చేస్తాన‌న్న ఆదాల‌

Ysrcp

Ysrcp

తాను పార్టీ మారుతున్నట్లు జ‌రుగుతున్న ప్రచారం నెల్లూరూ రూర‌ల్ వైసీపీ ఇంఛార్జ్‌, ఎంపీ ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డి ఖండించారు. పార్టీ అధిష్టానం వ‌ద్ద త‌న‌కు ఎలాంటి ఇబ్బంది లేద‌ని,, పార్టీ మారాల్సిన అవసరం లేదని ఎంపీ ఆదాల ప్రకటించారు. నెల్లూరు నగరపాలక సంస్థ 33వ డివిజన్‌లో రూ.1.40 కోట్లతో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి శంకుస్థాపన కార్య‌క్ర‌మంలో ఎంపీ ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డి పాల్గొన్నారు. నెల్లూరు రూరల్‌ నియోజకవర్గం తన నాయకత్వంలో అభివృద్ధి చెందడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని విమ‌ర్శించారు. త‌న‌ ప్రతిష్టను దిగజార్చేందుకే ప్రజలు ఇలాంటి ప్రచారానికి పూనుకున్నారని మండిప‌డ్డారు. తాను నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి తప్పకుండా ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని, దాని గురించి రెండో ఆలోచన లేదన్నారు. తాను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతానని, వదంతులను నమ్మవద్దని ఆయన పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. 2024 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో కష్టపడాల్సిన సమయం ఇదేనని పార్టీ కార్యకర్తలకు సూచించారు.

Also Read:  Unique Auction of Fighter Rooster : పందెం కోడిని వేలానికి సిద్ధం చేసిన TSRTC