తెలంగాణ (Telangana) లో ఎలాగైతే బిఆర్ఎస్ (BRS) కు వరుస షాకులు తగులుతున్నాయో…ఏపీలో కూడా అదే మాదిరి వైసీపీ (YCP) కి వరుస షాకులు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు భారీగా నేతలు పార్టీ కి రాజీనామా చేసి టీడీపీ లో చేరారో..ఇక ఫలితాల తర్వాత కూడా అదే విధంగా నేతలు బయటకు వస్తున్నారు. ఇప్పటికే పలువురు టీడీపీ లో చేరగా..ఇప్పుడు పలువురు వైసీపీ ఎమ్మెల్సీలు టీడీపీలో చేరేందుకు మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ కీలక నేతలు, మంత్రులను కలిసి చర్చించినట్లు సమాచారం.
We’re now on WhatsApp. Click to Join.
శాసనమండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ ఎం.జకియా ఖానం మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌తో భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. ఇన్నాళ్లూ తాను వైసీపీ లో ఎదుర్కొన్న అవమానకర పరిస్థితులను ఆమె మంత్రి దగ్గర ప్రస్తావించినట్లు తెలుస్తోంది. వైసీపీ లో కొనసాగే పరిస్థితి లేదని ఆమె సంకేతాలు ఇచ్చారని అంటున్నారు. ఆమె సామాజికవర్గానికే చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్సీల్లో ఒకరు ఇప్పటికే మంత్రి ఫరూక్‌ను కలవడం విశేషం. రెండో ఎమ్మెల్సీ సమయం ఇస్తే.. వచ్చి కలుస్తానంటూ సమాచారం ఇచ్చారట. వైసీపీ మద్దతుతో గెలిచిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీల్లో ఇద్దరు టీడీపీతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. వారు కూడా త్వరలోనే ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. కాగా మండలిలో వైసీపీకి 38 మంది, టీడీపీకి 9, జనసేనకు ఒక ఎమ్మెల్సీ ఉన్నారు.