Site icon HashtagU Telugu

AP: అనారోగ్యంతో వైసీపీ ఎమ్మెల్సీ మృతి..!!

Bhagiratha Reddy

Bhagiratha Reddy

ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి అనారోగ్యంతో ఇవాళ మరణించారు. కర్నూలు జిల్లాలోని ఆవుకు మండలం ఉప్పలపాడు ఆయన స్వస్థలం. రేపు ఆవుకులో అంత్యక్రియలు నిర్వహించినున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. భగీరథ రెడ్డి అంత్యక్రియలకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి హాజరవుతారు. గతకొంత కాలంగా అనారోగ్యంగా ఉన్న చల్లా భగీరథరెడ్డి హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొదుతూ ఇవాళ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు.

మాజీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి తనయుడు చల్లా భగీరథరెడ్డి. ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు.  రామకృష్ణారెడ్డి ఆకస్మికంగా మరణించడంతో భగీరథరెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చారు జగన్. తండ్రి మరణించిన రెండు సంవత్సరాలకే కొడుకు కూడా మరణించడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.