ఏపీలో వైసీపీ నేతల తీరు నిత్యం విమర్శల పలు చేస్తుంటాయి. ప్రజలకు సేవ చేయాలనీ గెలిపిస్తే..వారు మాత్రం వారి ఇష్టానురాజ్యంగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ముఖ్యంగా సంక్రాంతి వేడుకల్లో వారి అత్యత్సం తీవ్ర విమర్శల పాలుచేస్తుంది. గత సంక్రాంతి వేడుకల్లో గుడివాడ ఎమ్మెల్యే నాని..ఏకంగా పేకాట క్లబ్స్ , తదితర వివాదాస్పద ఆటలు పెట్టి వార్తల్లో నిలువగా..తాజాగా విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ 400 మంది వైసీపీ కార్యకర్తలకు ఒకొక్కరికి ఫుల్‌బాటిల్ మద్యంతో పాటు రెండు కిలోల కోడిని పంపిణీ చేయడం.. అది కూడా విద్యాసంస్థను వేదికగా చేసుకోవడం స్థానికంగా తీవ్ర విమర్శలకు తావిచ్చింది.
We’re now on WhatsApp. Click to Join.
నగరంలోని ఆశీలుమెట్టలో రామబాణం పేరుతో జూనియర్ కళాశాలను ఎమ్మెల్యే వాసుపల్లి నిర్వహిస్తున్నారు. ఈ కళాశాలలోని ఓ గదిని తన కార్యాలయంగా ఏర్పాటు చేసుకొని. నిన్న కనుమ సందర్బంగా వందల కోళ్లు, 400 వరకు మద్యం బాటిళ్లను తీసుకొచ్చి..కార్యకర్తలకు అందజేశారు. దీనికి సంబదించిన వీడియోస్ సోషల్ మీడియా లో చర్కాలు కొడుతున్నాయి. నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి వద్ద మూడు ఫుల్‌బాటిళ్లు మించి ఉండకూడదు. అయితే ఎమ్మెల్యే వాసుపల్లి ఏకంగా 400 ఫుల్‌బాటిళ్లు నిల్వ ఉంచారు. కార్యకర్తలకు మద్యం, కోళ్లు పంపిణీ చేయడానికి కళాశాలను ఎంపిక చేసుకోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also : Mumbai-Bengaluru Flight: విమానంలో వింత ఘటన.. వాష్‌రూమ్‌లో చిక్కుకున్న ప్రయాణికుడు..!