ఏపీ (AP)లో మరో మూడు నెలల్లో ఎన్నికలు (Elections) రాబోతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ (TDP) లోకి వలసల పర్వం మొదలైంది. గత ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున వైసీపీ (YCP) లోకి వెళ్లిన నేతలంతా ఇప్పుడు సొంతగూటికి చేరేందుకు సిద్ధం అవుతుండగా..మరికొంతమంది టికెట్ రాదనే కారణంతో టీడీపీ లోకి వచ్చేందుకు చూస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు టీడీపీ తో టచ్ లో ఉన్నారట..సమయం చూసి వైసీపీ కి బై బై చెప్పి సైకిల్ ఎక్కేందుకు చూస్తున్నారు. తాజాగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు (Jyothula Chantibabu)..టీడీపీ లో చేరేందుకు చూస్తున్నట్లు తెలుస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఇప్పటికే టీడీపీ పెద్దలతో చర్చలు పూర్తి అయినట్టు సమాచారం. 2009, 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరుపున జగ్గంపేట నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు చంటిబాబు.. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏలేరు ప్రాజెక్ట్ చైర్మన్ గా చంటిబాబును నియమించారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి జగ్గంపేట స్థానంలో పోటీ చేసిన విజయం సాధించారు. అయితే, వచ్చే ఎన్నికల్లో వైసీపీ టికెట్ జ్యోతుల చంటిబాబుకు ఇచ్చే పరిస్థితి లేదని క్లారిటీ రావడం తో..ఆయన టీడీపీ లో చేరేందుకు సిద్దమయ్యారట. త్వరలోనే దీనిపై ఓ అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఈయన ఒక్కరే కాదు చాలామంది ఎమ్మెల్యేలు ఇదే బాటలో ఉన్నారట. వచ్చే ఎన్నికల్లో వైసీపీ సీట్లు రావని తెలిసిన నేతలంతా టీడీపీ వైపు చూస్తున్నారు. మరి ఎన్నికల సమయం నాటికీ ఎంత మంది సైకిల్ ఎక్కుతారో..ఎంతమందికి బాబు టికెట్ ఇస్తారో..వీరిలో ఎంతమంది విజయం సాధిస్తారో చూడాలి.
Read Also : Singareni Elections : సింగరేణి కార్మికులకు 20 లక్షల వడ్డీలేని రుణం – పొంగులేటి