YSRCP Meeting :డిక్టేట్ నుంచి వేడుకోలు,`గ్రాఫ్ `లేని జ‌గ‌న్ రివ్యూ

ఎన్నిక‌ల‌కు సిద్ధం కావాల‌ని ఎమ్మెల్యేల‌కు(YSRCP Meeting) జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పిలుపు నిచ్చారు

  • Written By:
  • Updated On - April 4, 2023 / 11:00 AM IST

ఎన్నిక‌ల‌కు సిద్ధం కావాల‌ని ఎమ్మెల్యేల‌కు(YSRCP Meeting) జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పిలుపు నిచ్చారు. ఇంకా కేవ‌లం ఏడాది మాత్ర‌మే ఉంద‌ని చెబుతూ ఆగ‌స్ట్ నాటికి గ‌డ‌ప‌గ‌డ‌ప ప్రోగ్రామ్(No graph politics) పూర్తి చేయాల‌ని పిలుపునిచ్చారు. అంటే, ప‌రోక్షంగా ముంద‌స్తుకు సంకేతాలు ఇచ్చారు. ఆగ‌స్ట్ త‌రువాత మ‌రిన్ని ప్రోగ్రామ్ లు ఉంటాయ‌ని చెబుతూ అంద‌రికీ టిక్కెట్ అంటూ స్వ‌రాన్ని మార్చేసుకున్నారు. గ‌త రివ్యూ మీటింగ్ ల‌కు భిన్నంగా ఈసారి ఎమ్మెల్యేల‌ను బుజ్జ‌గించేలా మాట్లాడారు. గాసిప్స్ ను ఎప్ప‌టిక‌ప్పుడు తిప్పి కొట్టాల‌ని పిలుపునిచ్చారు. సోష‌ల్ మీడియా యాక్టివ్ కావాల‌ని పిలుపునిచ్చారు. వాలంటీర్లు, గృహ‌సారథులు క‌లిస్తే విజ‌యం మన‌దే అంటూ ధీమా వ్య‌క్త‌పరిచారు. గ‌తంలో మాదిరిగా గ్రాఫ్ ప్ర‌స్తావ‌న తీసుకురాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ఎన్నిక‌ల‌కు సిద్ధం కావాల‌ని ఎమ్మెల్యేల‌కు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పిలుపు(YSRCP Meeting) 

ముగ్గురు ప‌ట్ట‌భ‌ద్రులు, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఓడిన త‌రువాత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నిర్వ‌హించిన మీటింగ్ హాట్ హాట్ గా ఉంటుంద‌ని చాలా మంది భావించారు. గ్రాఫ్ (No graph politics)బాగాలేని వాళ్ల‌కు టిక్కెట్లు ఇవ్వ‌లేన‌ని మొహాన్నే చెబుతార‌ని టెన్ష‌న్ ప‌డ్డారు. కానీ, ఎవ‌ర్నీ వ‌దులుకోనంటూ ఎమ్మెల్యేల‌ను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్రాధేయ‌ప‌డిన‌ట్టు మాట్లాడ‌డం విచిత్రంగా ఉంది. క‌నీసం 50 మంది ఎమ్మెల్యేల‌ను మార్చేస్తార‌ని వ‌చ్చిన ప్ర‌చారానికి ఫుల్ స్టాప్ పెట్టారు. ఎవ‌ర్నీ వదులుకోనంటూ టెన్ష‌న్ పడ్డ ఎమ్మెల్యేల‌ను చ‌ల్ల‌బ‌రిచారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న ప్ర‌భావ‌మా? ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఓట‌మి షాక్ త‌గిలిందా? అనేది తెలియ‌దుగానీ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స్వ‌రంలో మార్పు స్ప‌ష్టంగా క‌నిపించింద‌ని మీటింగ్ లో (YSRCP Meeting)పాల్గొన్న వాళ్లు చ‌ర్చించుకుంటున్నారు.

10 మంది ఎమ్మెల్యేలు  జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రివ్యూ మీటింగ్ కు డుమ్మా

వైసీపీ ఎమ్మెల్యేలు గ‌ట్టు త‌ప్పారు. క‌నీసం 10 మంది జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రివ్యూ మీటింగ్ (YSRCP Meeting)కు డుమ్మా కొట్టారు. సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అనుచ‌రులుగా ప్రాచుర్యం పొందిన వాళ్లు కూడా స‌మావేశంలో కనిపించ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో రాలేక పోయారా? ఉద్దేశ పూర్వ‌కంగా డుమ్మా కొట్టారా? అనేది సందిగ్ధంగా ఉంది. మంత్రులు విడ‌ద‌ల ర‌జినీ, ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు కూడా మీటింగ్ లో క‌నిపించ‌క‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అంతేకాదు, మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌క్రిష్ణా రెడ్డి కూడా క‌నిపించ‌క‌పోవ‌డం హాట్ టాపిక్ అయింది.

గ‌డ‌ప‌ గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం అనే కార్య‌క్ర‌మం రివ్యూ

ముందుగా ప్ర‌క‌టించిన షెడ్యూల్ ప్ర‌కారం మూడో తేదీన ఉద‌యం రివ్యూ స‌మావేశం ప్రారంభం అయింది. తాడేప‌ల్లి ప్రాంగ‌ణం అంతా ఉత్కంఠ‌గా క‌నిపించింది. ఒక్కొక్క‌రుగా స‌మావేశ మందిరానికి ఎమ్మెల్యేలు  చేరుకున్నారు. ఎవ‌రు వ‌చ్చారు? ఎవ‌రు డుమ్మా కొట్టారు? అనే దానిపై ఆస‌క్తి నెల‌కొంది. ఎజెండా ఏమిటి అనేది కూడా ఎమ్మెల్యేల‌కు ముందుగా క్లారిటీ లేదు. కానీ, గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం అనే కార్య‌క్ర‌మం రివ్యూ (YSRCP Meeting)ఉంటుంద‌ని చూచాయగా అంద‌రికీ తెలుసు. ఆ క్ర‌మంలో ఎవ‌రెవ‌రికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి టిక్కెట్( No graph politics) లేద‌ని చెబుతారు? అనేది ఉత్కంఠ‌కు కార‌ణంగా క‌నిపించింది.

ఏప్రిల్ మూడు మీటింగ్ టెన్ష‌న్ వైసీపీ ఎమ్మెల్యేకు

వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జిలు, ప్రాంతీయ సమన్వయకర్తలతో సమీక్ష సమావేశం(YCP Meeting)  జ‌రిగింది . తాడేపల్లిలో  నిర్వ‌హించిన‌ ఈ సమావేశానికి పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. ధర్మాన ప్రసాదరావు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, విడదల రజని, ఆళ్ల రామకృష్ణారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ద్వారకానాథరెడ్డి హాజరు కాలేదు. ఆసరా కార్యక్రమం చెక్కుల పంపిణీ ఉన్నందున రాలేకపోయారని ధ‌ర్మాన‌ వర్గం చెబుతోంది. ఇక బుగ్గన కొవిడ్ బారినపడినట్టు సమాచారం. ఈ నెల 6న సీఎం జగన్ చిలకలూరిపేట నియోజకవర్గంలో పర్యటించన కార‌ణంగా విడదల రజని బిజీగా ఉన్నారు. వ్యక్తిగత కారణాలతో మ‌రికొంద‌రు ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. వైసీపీ అగ్రనేత సజ్జల రామకృష్ణారెడ్డి కూడా సీఎం సమీక్ష సమావేశంలో కనిపించలేదు. క‌డ‌ప‌లోని ఒక ప్రైవేటు కార్య‌క్ర‌మానికి వెళ్లిన‌ట్టు తెలుస్తోంది.

Also Read : YCP-Jagan : పెద్ద `రెడ్ల`తో పెట్టుకుంటే అంతే.! జ‌గ‌న్ రీ థింక్!

మొత్తానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఏప్రిల్ మూడు మీటింగ్ టెన్ష‌న్ వైసీపీ ఎమ్మెల్యేకు (YCP Meeting)త‌గ్గింది. ఇక గ‌డ‌ప‌గ‌డ‌ప ప్రోగ్రామ్ మీద దృష్టి పెట్టాల‌ని ఆయ‌న వేడుకుంటున్న‌ట్టు మాట్లాడం అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింద‌ట‌. `మీ గ్రాఫ్ బాగాలేక‌పోతే( No graph politics) పార్టీతో పాటు ప్ర‌జ‌లు న‌ష్ట‌పోతార‌ని హిత‌వు ప‌లికారు. కేవ‌లం రాజ‌కీయ ప్ర‌వ‌చ‌నాల‌తో రివ్యూ మీటింగ్ ముగియ‌డం గ‌మ‌నార్హం.

Also Read : PK-Jagan-CBN : BJP క‌ర్ణాట‌క గేమ్‌,APఅగ్ర నేత‌లపై ఢిల్లీ రైడ్‌!