Site icon HashtagU Telugu

YCP Manifesto 2024 : వైసీపీ మేనిఫెస్టో ఫై ..నెటిజన్ల ప్రశ్నలు

Ycp Manifesto 2024

Ycp Manifesto 2024

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వైసీపీ మేనిఫెస్టో (YCP Manifesto 2024 ) శనివారం వచ్చేసింది. గత ఎన్నికల మేనిఫెస్టో కు దీటుగా జగన్ ఈసారి మేనిఫెస్టో ను రిలీజ్ చేసారు. మేనిఫెస్టో లో ప్రధానంగా..

* వైఎస్సార్ చేయూత 75 వేల నుంచి నాలుగు దఫాలుగా లక్షా 50 వేలకు పెంపు
* వైఎస్సార్ కాపు నేస్తం 60 వేల నుంచి లక్షా 20 వేలకు పెంపు
* వైఎస్సార్ ఈబీసీ నేస్తం: 45 వేల నుంచి వచ్చే ఐదేళ్లలో లక్షా 5 వేలకు పెంపు
* జగనన్న అమ్మ ఒడి పథకం: 15 వేల నుంచి 17 వేలకు పెంపు
* రెండు విడుతల్లో పెన్షన్ 3500లకు పెంపు
* వైఎస్సార్ సున్నా వడ్డీలు రూ. 3లక్షలకు పెంపు

We’re now on WhatsApp. Click to Join.

* అర్హులైన పేదలకు ఇళ్లులేని వారికి ఇళ్లు,ఇంటి స్థలం కొనసాగింపు
* వైఎస్సార్ కళ్యాణమస్తు, షాది తోఫా కొనసాగింపు
* వైఎస్సార్ రైతు భరోసా.. రూ.16 వేలు, కౌలు రైతులకు కూడా రైతు భరోసా
* జిల్లాకో స్కిల్ డెవ్ లప్ మెంట్ కాలేజీ, తిరుపతిలో స్కిల్ యూనివర్శిటీ
* వాహన మిత్ర, మత్సకార భరోసా కొనసాగుతాయి
* 175 స్కిల్ హబ్ లతో యువతకు ఉపాధి
* యూనివర్శిటీల్లో ఖాళీగా ఉన్న 3590 పోస్టులు భర్తీ
* లా నేస్తం, చేనేత నేస్తం కొనసాగుతుంది
* 2025 నుంచి ఒకటో తరగతి నుంచి ఐబీ సిలబస్
* ఎస్సీ,ఎస్టీ కాలనీలకు ఉచిత కరెంట్
* మత్స్యకార భరోసా కింద ఐదు విడుతల్లో రూ. 50 వేలు ఇస్తామని హామీలు ఇచ్చింది. ఈ హామీల ఫై నెటిజన్లు ప్రశ్నలు సంధించడం మొదలుపెట్టారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చారు..? రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు వచ్చాయి..? ఎంతమంది యువతకు మీరు ఉద్యోగాలు ఇచ్చారు..? రాష్ట్రం ఎంత అభివృద్ధి జరిగింది..? 130 సార్లు బటన్ నొక్కినని చెపుతున్న మీరు ఎంతమందికి డబ్బులు ఇచ్చారు..? లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రానికి , రాష్ట్ర ప్రజలు మీరు చేసింది ఏంటి..? మీ అధికారం చేపట్టిన దగ్గరి నుండి క్రైం రేటు ఎంత పెరిగింది…? ఎన్ని దాడులు జరిగాయి..? దళితులను చంపి డోర్ డెలివరీ చేసిన నేతను మీరు ఏంచేశారు..?

ఇప్పుడు మీరు ప్రకటించిన మేనిఫెస్టో బాగుంది.. మన రాష్ట్ర ఆదాయం ఎంత…? మీ పథకాలు అయ్యే ఖర్చు ఎంత…? రాష్ట్ర అభివృద్ధి… నీటి ప్రాజెక్ట్లు, రోడ్డులు… ఉపాధి అవకాశాలు… మాటేమిటి…? రాష్ట్ర పన్నులు తగ్గుతుందా…? మధ్య తరగతి ప్రజలకు ఎటువంటి హామీ ఇవ్వగలరు…? దేవాలయాలను గవర్నమెంట్ అధీనం నుండి తొలిగించాలి… ప్రజా ఆస్తులుకి రక్షణ ఉండాలి… ఇంతకు ముందు చేసిన అప్పుల మాటేమిటి… ఎలా తీరుస్తారు… పథకాలు డబ్బు ఎలా తెస్తారు.? అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. మరి వీటికి ఎవరు సమాధానం చెపుతారో చూడాలి.

Read Also : Robert Vadra : నేను పాలిటిక్స్‌లోకి రావాలని దేశమంతా కోరుకుంటోంది : రాబర్ట్ వాద్రా