Site icon HashtagU Telugu

YCP Luck : జ‌గ‌న్ కు మేలుచేసేలా ప‌వ‌నిజం

Ycp Luck

Ycp Luck

జ‌న‌సేన చీఫ్ దూకుడు, నోరుజార‌డం ఆ పార్టీకి  (YCP Luck) మేలా? ఎవ‌రికి ఆయ‌న వారాహి యాత్ర లాభం? అంటే వైసీపీకి సానుకూల‌మంటూ స‌రికొత్త వాద‌న వినిపిస్తోంది. సీఎం హోదాలో ఉన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మీద‌ వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌కు దిగ‌డం కార‌ణంగా స్తబ్దుగా ఉన్న వైసీపీ క్యాడ‌ర్ జూలు విదిలించింది. సోష‌ల్ మీడియాలో జ‌న‌సైన్యానికి ధీటుగా ఫ్యాన్ బ్యాచ్ ఢీ కొట్టింది. అంతేకాదు, ఎన్నిక‌ల నాటికి మ‌రింత బ‌లోపేతం కావ‌డానికి ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేసుకుంది.

సోష‌ల్ మీడియాలో జ‌న‌సైన్యానికి ధీటుగా ఫ్యాన్ బ్యాచ్ ఢీ (YCP Luck)

వాస్త‌వంగా ప‌వ‌న్ వారాహి యాత్ర ప్రారంభించే నాటికి వైసీపీ చీఫ్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మీద కొంద‌రు అసంతృప్తిగా ఉన్నారు. ఆ పార్టీలోని లీడ‌ర్లు క్ర‌మంగా జారుకునే ప‌రిస్థితి ఏర్ప‌డింది. సొంత సామాజిక‌వ‌ర్గంకు చెందిన లీడ‌ర్లు, క్యాడ‌ర్ కూడా అస‌హ‌నంగా ఉండేది. ఆ స‌మ‌యంలో ప‌వ‌న్ వారాహి వాహ‌నం ఎక్కారు. వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు చేస్తూ వైసీపీ ఎమ్మెల్యేల‌ను రెచ్చ‌గొట్టారు. ప్ర‌జాస్వామ్య‌బ‌ద్ధంగా ఎన్నికైనా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని డెకాయిట్, దొంగ అంటూ ప్రైవేటు జీవితంలోకి ఎంట్రీ ఇచ్చారు. అంతేకాదు, రెడ్డి సామాజిక‌వ‌ర్గాన్ని (YCP Luck)టార్గెట్ చేస్తూ మాట్లాడారు.

జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని డెకాయిట్, దొంగ అంటూ ప్రైవేటు జీవితంలోకి ఎంట్రీ

సామాజిక‌వ‌ర్గం గురించి ప‌వ‌న్ ఎప్పుడైతే, ఎక్కువ‌గా మాట్లాడ‌డం ప్రారంభించారో, అప్ప‌టి నుంచి రెడ్డి సామాజిక‌వ‌ర్గం పున‌రాలోచ‌న‌లో (YCP Luck) ప‌డింది. అప్పటి వ‌ర‌కు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మీద కొంత అసంతృప్తిగా ఉన్న ఆ సామాజిక‌వ‌ర్గం ఇప్పుడు ఏక‌మయింది. ప్ర‌తిరోజూ వారాహి వాహ‌నంపై నుంచి ప‌వ‌న్ చేసే వ్యాఖ్య‌లు, శ‌పథాలు, శాప‌నార్థాల‌ను `రెడ్డి` సామాజిక‌వ‌ర్గం గ‌మ‌నించింది. గ‌తంలోనూ 2019 ఎన్నిక‌ల్లో ఇలాంటి శాప‌నార్థ‌ల‌ను ప‌వ‌న్ పెట్టారు. ఎట్టిప‌రిస్థితుల్లోనూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని సీఎం కానివ్వ‌ను, అవ్వ‌డు అంటూ శాపం పెట్టారు. ఆ వీడియో ఇప్ప‌టికీ వైర‌ల్ అవుతోంది.

Also Read : YCP Policing : పుంగ‌నూరులో త‌ప్పంతా టీడీపీదేన‌ట‌.!

ఇప్పుడు కూడా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని సీఎం కానివ్వ‌ను అంటూ ప‌వ‌న్ చెబుతున్నారు. ఇలాంటి మాట‌లు `రెడ్డి` సామాజిక‌వ‌ర్గాన్ని రెచ్చ‌గొట్టేలా ఉన్నాయి. ఆ సామాజిక‌వ‌ర్గంకు చెందిన వాళ్లు ఐక్యం కావ‌డానికి ప‌వ‌న్ వ్యాఖ్య‌లు దోహ‌ద‌ప‌డ్డాయ‌ని తాజా ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే బోధ‌ప‌డుతోంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబును సీఎం చేయ‌డానికి ప‌వ‌న్ క‌ష్ట‌ప‌డుతున్నాడంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా హోరెత్తుతోంది. ఇటీవ‌ల వ‌ర‌కు కొంత స్లోగా ఉన్న వైసీపీ సోష‌ల్ మీడియా ఇప్పుడు యాక్టివ్ అయింది. కొత్త‌గా రిక్రూట్ మెంట్ కూడా జ‌రుగుతోంది. రాబోవు రోజుల్లో ప‌వ‌న్ మీద ట్రోల్స్ చేయ‌డం ద్వారా ఆ పార్టీని పెంచ‌డం ఒక వ్యూహంకాగా, ప‌రోక్షంగా టీడీపీని బ‌ల‌హీన‌ప‌ర‌చ‌డం మ‌రో ఎత్తుగ‌డ‌గా ఉంది.

Also Read : TDP-BJP Alliance: టీడీపీ ఎన్డీయే పొత్తుపై బాబు క్లారిటీ

స‌హ‌జంగా త‌మ వాళ్ల‌ను తిడితే, ఎవ‌రైనా ఒక‌ట‌వుతారు. అలాగే, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని, ఆ కుటుంబాన్ని ప‌వ‌న్ ప‌రుష‌ప‌ద‌జాలంతో దూషిస్తున్నారు. ఫ‌లితంగా `రెడ్డి` సామాజిక‌వ‌ర్గం ఎప్ప‌టి మాదిరిగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వైపు మ‌ళ్లుతున్నారు. అదే స‌మ‌యంలో కాపు సామాజిక‌వ‌ర్గం టీడీపీకి దూరం అవుతోంది. అందుకే, జ‌న‌సేన కు టీడీపీ వాళ్లు ఓటేసినా, పొత్తుల్లో బీజేపీకి జ‌న‌సేన ఓటేస్తుంద‌ని ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఇటీవ‌ల ట్వీట్ చేయ‌డం జ‌రిగింది. మొత్తం మీద ప‌వ‌న్ నోరుజార‌డం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పార్టీకి క‌లిసొస్తుంద‌న్న‌మాట‌.