AP : కాళ్లు పట్టుకునే స్థాయికి దిగజారిన వైసీపీ నేతలు..

  • Written By:
  • Publish Date - May 8, 2024 / 03:22 PM IST

అవకాశవాది తన పని పూర్తి చేసుకోటానికి ముందు గడ్డం పట్టుకు బ్రతిమిలాడతాడు, అయినా పని కాకపోతే కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడతాడటానికి కూడా వెనకాడడు..ఇప్పుడు వైసీపీ (YCP) అభ్యర్థులు కూడా అదే చేస్తున్నారు. మొన్నటి వరకు ప్రజల జుట్టు పట్టుకున్నవారు..నేడు ఓటు కోసం కాళ్లు పట్టుకుంటున్నారు. అమ్మ..అయ్యా..అన్న..చెల్లి ఈ ఒక్కసారి ఓటు వెయ్యండి..అంటూ పోలింగ్ బూత్ సెంటర్ ముందు లోపలి వెళ్లే వారి కాళ్లు పట్టుకొని బ్రతిమాలాడుకుంటున్నారు. ఐదేళ్లు మంచి చేస్తే ఇంత కాళ్లు పట్టుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు కదా అంటున్నారు ఓటర్లు.

We’re now on WhatsApp. Click to Join.

ఏపీ(AP)లో గత నెల క్రితం వరకు ఓ లెక్క ఉండేది..ఇప్పుడు ఓ లెక్కగా మారింది. ఇది మీము చెప్పడం లేదు వైసీపీ అభ్యర్థులు ..ఏకంగా జగనే (Jagan) చెపుతున్న మాట. మొన్నటి వరకు 175 కు 175 కొట్టబోతున్నాం అంటూ ఎవరికీ వారే ధీమా చేస్తూ వచ్చారు..కానీ ఇప్పుడు ఆ మాటే కాదు కదా..అసలు గెలుపు మాటే మరచిపోయారు. కూటమి గెలవబోతుంది..అక్కడ మన అభ్యధులు ఓటమి చెందుతున్నారు..ఇక్కడ మెజార్టీ తక్కువగా వస్తుంది..అక్కడ మన నేతలకు ఓటు అడగడానికి వెళ్తే కొట్టేంత పని చేస్తున్నారు..అసలు అక్కడ ఆ అభ్యర్థిని పట్టించుకునే వారు లేరు..ఇలా గత 10 రోజులుగా వైసీపీ అభ్యర్థులు మాట్లాడుకుంటూ వస్తున్నారు.

తాజాగా పోస్టల్ బ్యాలెట్ ఉద్యోగులు ఓటు వేయడానికి వెళ్తుంటే వైసీపీ నాయకులు కాళ్లు పట్టుకొని ఓటేమని అడుగుతున్నారు. ఇంతలా దిగజారిపోయారేంట్రా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ అభ్యర్థుల్లో ఓటమి భయం మొదలైంది అని స్పష్టంగా తెలుస్తుంది.

Read Also : SRH vs LSG: నేడు ల‌క్నో వ‌ర్సెస్ స‌న్ రైజ‌ర్స్‌.. హైద‌రాబాద్ హోం గ్రౌండ్‌లో రాణించ‌గ‌ల‌దా..?