Hyderabad : హైదరాబాద్ ఫై కన్నేసిన వైసీపీ నేతలు..?

  • Written By:
  • Publish Date - February 13, 2024 / 02:08 PM IST

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి..పదేళ్లు గడుస్తుంది. రెండు రాష్ట్రాల్లో ప్రత్యేక ప్రభుత్వాలు ఏర్పాటై పాలన కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా వైసీపీ నేతలు మళ్లీ హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిని చేయాలనీ కొత్త పాట అందుకున్నారు. ఏపీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అమరావతిని రాజధానిగా కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు నిధులు కూడా విడుదల చేసింది. అప్పటి టిడిపి ప్రభుత్వం కూడా అమరావతి లో పెద్ద ఎత్తున ప్రభుత్వ కార్యాలయాలు నిర్మాణం చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ..అమరావతి ని రాజధానిగా కాకుండా మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. కానీ ఆచరణలోకి తీసుకురాకుండా గడిపేశారు. మూడు రాజధానులు లేవు..ఒక రాజధాని లేదు..అసలు ఏపీకి రాజధానే లేకుండా జగన్ చేసాడు.

ఇక ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడం తో ప్రతిపక్ష పార్టీలు రాజధాని అంశాన్ని బయటకు తీయడం తో అధికార నేతలు కొత్త పాట మొదలుపెట్టాడు. అదే హైదరాబాద్. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నే ఉంచాలని వారంతా వాపోతున్నారు. ఇప్పటీకే పలువురు మంత్రులు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధాని గా ఉంచాలంటూ కామెంట్స్ చేయగా..తాజాగా పెద్దిరెడ్డి సైతం అదే పాట పాడుకొచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించడం, కృష్ణా జలాల వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా మరికొన్నాళ్లు ఉంటే మంచిదేనన్నారు. రాష్ట్రానికి తాము ఎక్కువ కృష్ణా జలాలు తీసుకొచ్చామని, ఇదే విషయాన్ని తెలంగాణ మంత్రి ఉత్తమ్ అసెంబ్లీలో చెప్పారని పెద్దిరెడ్డి గుర్తు చేశారు. ఈ విషయాన్ని రాష్ట్రంలోని విపక్షాలు అర్థం చేసుకోవాలని సూచించారు. ఈయన మాటలు విన్న వారంతా అబ్బా అనుకుంటున్నారు. ఏపీ తో ఏమివద్దంటూ అన్ని తేల్చేస్తే..మళ్లీ ఇప్పుడు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధాని చేయాలనీ అనడం నవ్వొస్తుందని తెలంగాణ నేతలు అంటున్నారు. అమరావతిని రాజధానికి చేసుకోండి అని చెపితే అది చేతకాక..నిధులను జేబులు వేసుకొని..అసలు రాష్ట్రానికే రాజధాని లేకుండా చేసి..ఇప్పుడు హైదరాబాద్ మీద పడ్డారేంటి అని ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు ఏ సమాధానం చెప్పాలో తెలియక..ఇప్పుడు హైదరాబాద్ పేరును జపిస్తున్నారని వాపోతున్నారు.

Read Also : Farmers: పంజాబ్-చండీగఢ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. రైతులపై టియర్‌ గ్యాస్‌ ప్రయోగం