కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైసీపీ (YCP) నేతల బృందం ఈ రోజు (గురువారం) కలిశారు. పార్టీ పార్లమెంటరీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఈ సమావేశం కేంద్ర ఎన్నికల సంఘం ఆహ్వానంతో జరిగినదని తెలిపారు. సమావేశంలో ఓటర్ల జాబితా, పోలింగ్ సరళి, ఈవీఎంల వాడకంపై చర్చలు సాగాయి. ముఖ్యంగా 2024 సాధారణ ఎన్నికల్లో ఈవీఎంలపై ఉన్న అనుమానాలను విపులంగా ప్రస్తావించినట్లు వెల్లడించారు. వివిధ నియోజకవర్గాల్లో ఈవీఎంల ఓట్లను వివి ప్యాట్‌ల (VVPAT) తో పోల్చి చూడాలన్న డిమాండ్‌ను ఈసీ ఎదుట ఉంచినట్లు తెలిపారు.
MLC Kavitha : 42 శాతం బీసీ రిజర్వేషన్లు లేకుండా స్థానిక ఎన్నికలు వద్దు : ఎమ్మెల్సీ కవిత
సాయంత్రం 6 గంటల తర్వాత ఏపీలో భారీగా ఓట్లు పోలైన విషయంపై అనుమానాలు ఉన్నాయని , ఈ సమయంలో దాదాపు 50 లక్షల ఓట్లు వేసినట్టు నమోదైందని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. విజయనగరం పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈవీఎం, వివి ప్యాట్‌ల మధ్య పోలికను కోరినప్పటికీ, ఈసీ నిరాకరించిందని విమర్శించారు. అంతేగాక పోలింగ్ కేంద్రాల్లో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్‌ను విడుదల చేయాలని అడిగినప్పటికీ ఎన్నికల సంఘం తిరస్కరించిందని చెప్పారు. ఈ వ్యవహారమంతా పారదర్శకత లేకుండా జరిగిందని ఆరోపించారు.
HHVM Trailer : అదిరిపోయిన హరిహర వీరమల్లు ట్రైలర్ ..ఫ్యాన్స్ కు పూనకాలే
రాయచోటిలో ఓటర్ల సంఖ్య అనూహ్యంగా పెరిగిందని పేర్కొంటూ, బీహార్‌లో చేసిన విధంగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా స్పెషల్ ఇంటెన్సిఫైడ్ రివిజన్ (Special Intensive Revision) చేయాలని కోరినట్లు తెలిపారు. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓ బూత్‌లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు వేర్వేరు ఓట్ల నిక్షేపం జరిగిందని ఆరోపించారు. ఈవీఎంలలో అనేక లోపాలు ఉన్నందున, అభివృద్ధి చెందిన దేశాల తరహాలో భారత్‌లో కూడా బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు నిర్వహించాలన్నది తమ డిమాండుగా చెప్పారు. తాము ఎన్‌డీఏలో గానీ, ఇండియా కూటమిలో గానీ లేమని, తమ నేత జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ అంశాలను ఈసీ ఎదుట వివరించినట్లు తెలిపారు.