ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీ పార్టీ ఖాళీ అవుతూ వస్తుంది. ఇప్పటికే ఎంతోమంది కీలక నేతలు పార్టీని వీడగా..ఇప్పుడు ఉన్న కొద్దీ గొప్ప మందికూడా పార్టీకి రాజీనామా చేసి టీడిపి లో చేరుతున్నారు. తాజాగా మాజీ మంత్రి శమంతకమణి, ఆమె కొడుకు అశోక్ లు వైసీపీకి రాజీనామా చేశారు. కొద్దిరోజులుగా వీరిద్దరూ వైసీపీ ఫై అసంతృప్తి తో రగిలిపోతున్నారు. ఈ క్రమంలో వారు వైసీపీకి రాజీనామా చేశారు. సింగనమల వైసీపీ టికెట్‌ను శమంతకమణి, ఆమె కుమారుడు ఆశించారు. కానీ పాతవారికి జగన్ టికెట్ కేటాయించడంతో వారు అధిష్టానం ఫై కోపం తో గుడ్ బై చెప్పారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇటు కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున వైసీపీ నేతలు టీడీపీ లో చేరారు. పైస్థాయి నేతల దగ్గరి నుండి కింది స్థాయి నేతలు , కార్యకర్తలు ఇలా అనేకమంది వైసీపీ లో మీము ఉండలేము అంటూ మూకుమ్ముడిగా రాజీనామా చేసి, టీడీపీ పార్టీ లో చేరుతున్నారు. తాజాగా అనుగొండ గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకులు రామలింగం ఆ పార్టీని వీడి టీడీపీ చేరారు. కోడుమూరు నియోజకవర్గం టీడీపీ పార్టీ నాయకులు డి.విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో రామలింగం వైసీపీని వీడి సుమారు వెయ్యి మంది అనుచరులతో టీడీపీ పార్టీలో చేరారు. వైసీపీలో తమకు ఎలాంటి గౌరవం దక్కనందుకు టీడీపీ పార్టీలో చేరినట్లు రామలింగం తెలిపారు.
Read Also : BRS : 15 లక్షల ఎకరాల్లో ఎండిన పంటలు..నష్టం 3 వేల కోట్లు!.. బీఆర్ఎస్ ట్వీట్