Site icon HashtagU Telugu

AP : ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ నుండి పెద్ద ఎత్తున జనసేన లో చేరిన నేతలు

Ycp Leaders Joined Janasena

Ycp Leaders Joined Janasena

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీ వైసీపీ (YCP) కి భారీ షాకులు తగులుతున్నాయి. రాష్ట్రంలో వైసీపీ కి ఉన్న వ్యతిరేకత దృష్ట్యా..నేతలు , కార్యకర్తలు పార్టీని వీడి, టీడీపీ – జనసేన పార్టీలలో చేరుతున్నారు. ఇప్పటికే పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీ లు ఇరు పార్టీలలో చేరగా..ఇక ఇప్పుడు కార్యకర్తలు పెద్ద ఎత్తున వైసీపీ నుండి బయటకు వస్తూ జనసేన లో చేరుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన కార్యదర్శి, వినుకొండ నియోజకవర్గ నాయకుడు నిశ్శంకరావు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో న్యూజెండ్ల మండలం కంభంపాడుకి చెందిన వైసీపీ నాయకులు గాజులు శ్రీను, యర్రబోతుల గురుబ్రహ్మాం, కృష్ణ మూర్తి, తోట బాలయ్య, గాజుల రామారావు, వెన్ను యోగ్య, మణికంఠ, జగదీష్, సిరి బాబు, గాజుల నాగేశ్వరరావు, గాజుల గురవయ్య జనసేనలో చేరారు. వీరికి నిశ్శంకరావు శ్రీనివాసరావు జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

మరోపక్క జగన్ తీరుతో వైసీపీ నేతల్లో కలవరం తారస్థాయికి చేరింది. కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్​ లేదనడంతో ఎవరి సీటు ఉంటుందో.. మరెవరి స్థానం గల్లంతవుతుందో అర్థంకాని అయోమయంలో పడ్డారు. ఎంపీ అభ్యర్థులను ముందుగా డిపాజిట్ చేయాలనడంతో వెనకడుగు వేస్తున్నారు. నియోజకవర్గాలు మారిన నేతల్లో గెలుస్తామో లేదోనన్న బెంగ పట్టుకుంది. ఇక షర్మిల కాంగ్రెస్ నుంచి రాష్ట్రంలో అడుగు పెడతారనడంతో పార్టీకి కోలుకోలేని దెబ్బ తగులుతుందని ఆందోళన చెందుతున్నారు. అందుకే పార్టీని వరుసపెట్టి వీడుతున్నారు.

Read Also : YS Sharmila : ఆర్కే కు ధన్యవాదాలు తెలిపిన షర్మిల