Site icon HashtagU Telugu

Chiranjeevi Vs YCP : వైసీపీ నేతలు మళ్లీ..మళ్లీ అదే తప్పు చేస్తున్నారా..?

YCP Leaders Counter To Chiranjeevi

YCP Leaders Counter To Chiranjeevi

 

అంటే అవుననే చెప్పాలి..ప్రతిపక్ష పార్టీలైన..సమాజంలో ఓ ఉన్నత స్థాయి వ్యక్తయినా ఏదైనా విమర్శ చేస్తే..దానికి సమాధానం చెప్పాలిన బాధ్యత ప్రభుత్వం ఫై..అధికార పార్టీ నేతలపై ఉంటుంది. ఉదాహరణకు తెలంగాణ (Telangana ) లో ప్రతిపక్ష పార్టీలు..అధికార పార్టీ (BRS) ఫై ఏదైనా విమర్శలు చేస్తే..వారు ప్రతి విమర్శలు చేయరు. వారు చేసిన అభివృద్ధి..అందిస్తున్న సంక్షేమ పథకాలు..ఆసరా పెన్షన్లు..రోడ్ల అభివృద్ధి..రాష్ట్రానికి తీసుకొచ్చిన పెట్టుబడులు ..కట్టిన ప్రాజెక్ట్ లు ఇలా అన్నింటి గురించి తెలిపి వారి నోరు మోయిస్తారు.

కానీ ఏపీ (AP)లో మాత్రం ఆలా కాదు..ఎవరైనా ప్రభుత్వం ఏంచేసింది..? పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసిందా..? రోడ్లు వేసిందా..? రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చిందా..? ఎన్ని లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు..? ప్రజలకు ఎంత మేలు చేసారు..? అని ప్రశ్నింస్తే చాలు..అభివృద్ధి ఫై మాట్లాడని మంత్రులు , నేతలు ఆ విమర్శలు చేసిన వారిపై విరుచుకపడేందుకు మీడియా ముందుకు వస్తారు. కేవలం తమపై విమర్శలు చేసిన వారిపై ప్రతివిమర్శలు చేసేందుకు తప్పితే మరెప్పుడు మీడియా ముందుకు రారు.

మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రభుతాన్ని ప్రశ్నింస్తే..తనపై వ్యక్తిగత విమర్శలు చేసారు..ఆ తర్వాత రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి రాష్ట్ర అప్పుల గురించి ప్రశ్నిస్తే ..చంద్రబాబు ను మధ్యలో తీసుకొచ్చి ఆమెపై విమర్శలు చేసారు. ప్రతిపక్ష నేత , టీడీపీ అధినేత అలాగే ప్రశ్నిస్తే ..అలాగే విమర్శలు చేసారు. ఇక ఈరోజు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తన సినిమా ఈవెంట్ లో మాట్లాడుతూ..‘‘మీలాంటి వాళ్లు (వైసీపీ నేతలు) ప్రత్యేక హోదా గురించి గానీ, రోడ్ల నిర్మాణం గురించి గానీ, ప్రాజెక్టులు గురించి గానీ, పేదవారికి కడుపు నిండే విషయంగానీ, ఉద్యోగ , ఉపాధి అవకాశాలు కల్పించడం.. వాటి గురించి ఆలోచించాలి. అంతేగాని పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీ మీద పడతారేంటి?” అని వ్యాఖ్యానించారు.

అంతే..వైసీపీ నేతలు , మంత్రులు మీడియాల ముందు వాలిపోయారు. ఇలాగైనా వార్తల్లో నిలువచ్చున్నట్లు చిరంజీవి ఫై ఎవరికీ వారు వారి వారి స్క్రిప్ట్ లలో రెచ్చిపోయారు. చిరంజీవి అంటే అభిమానమే అని చెపుతూనే..ఆయనపై విమర్శలకు దిగారు.

పేర్ని నాని (Perni Nani) స్పందిస్తూ.. తన అభిమాన నటుడు (చిరంజీవి) కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు. ప్రత్యేక హోదా చట్టంలో పెట్టకుండా అప్పటి ప్రభుత్వం వ్యవహరించినప్పుడు అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న చిరంజీవి ఏం చేశారంటూ నాని ప్రశ్నించారు. సినిమాను సినిమాగా.. రాజకీయాలను రాజకీయంగా చూడాలని.. రాజకీయాల్లో దాడి చేస్తే ఎదురుదాడి ఖాయమన్నారు. దృతరాష్ట్రుడికి తన కుమారులపై ప్రేమ ఉంటే ఎలా నష్టం జరిగిందో.. అలాంటి ప్రేమ ఉంటే ఇప్పుడూ నష్టం జరుగుతుందన్నారు. హైదరాబాద్ ఫిలిమ్ నగర్ నుండి ఏపీ సచివాలయానికి ఎంత దూరమో.. ఏపీ సచివాలయం నుండి హైదరాబాద్ ఫిలిమ్ నగర్ అంతే దూరమని గుర్తుంచుకోవాలన్నారు.

అసలు రెమ్యునరేషన్ గురించి చర్చ ఎక్కడ వచ్చింది? ఎందుకు వచ్చిందో తెలుసా? అని ప్రశ్నించారు. కథకు సంబంధం లేకుండా సినిమాలో మీ దురద తీర్చుకోవాలనుకున్నప్పుడు అదే తరహా ఎదురు దాడి జరిగిందని.. దాడి జరిగినప్పుడు ఎదురు దాడి సహజమేనని అన్నారు. ఒక రాజకీయ నాయకుడు సంక్రాంతి పండుగ సందర్భంగా డ్యాన్స్ చేస్తే, దానిని పోలిన పాత్ర సినిమాలో పెట్టి, ఒక రాజకీయ నాయకుడిపై కక్ష తీర్చుకునే ప్రయత్నం చేశారన్నారు. అలాంటి సమయంలో రెమ్యునరేషన్ గురించి చర్చ వచ్చిందన్నారు. చిరంజీవి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు రెమ్యునరేషన్ గురించి ఎవరైనా అడిగారా? అని ప్రశ్నించారు.

మంత్రి అంబటి రాంబాబు (Minister Ambati Rambabu) స్పందిస్తూ.. ఏమ్‌… మీరు గిల్లితే మేం గిల్లిచ్చుకోవాలా..? మమ్మల్ని గిల్లుతున్నారు కాబట్టే… మేం రియాక్ట్‌ కావాల్సి వస్తోందంటున్నారు.

మంత్రి బొత్స  (Minister Botsa Satyanarayana) స్పందిస్తూ.. సినిమా పరిశ్రమ ఓ పిచ్చుకనా? చిరంజీవి చెప్పాలన్నారు. ఏ ఉద్దేశంతో చిరంజీవి అలా మాట్లాడారో తెలియదని , ఆయన ఎందుకు ఆ వ్యాఖ్యలు చేశారో చెప్పాలన్నారు. ఆయన వ్యాఖ్యలు చూశాక పూర్తిస్థాయిలో స్పందిస్తానని అన్నారు.

 ఎంపీ నందిగం సురేశ్ (MP Nandigam Suresh) స్పందిస్తూ… ‘చిరంజీవి తొలుత మొదలు పెట్టిందే మీ తమ్ముడు’ అని ట్వీట్ చేశారు. బురద రాజకీయాలు చేయవద్దని, నోరు అదుపులో పెట్టుకోవాలని మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ కు ముందు చెప్పండి…. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఎలా తీసుకురావాలో మేం చూసుకుంటామని అన్నారు.

గుడివాడ అమర్నాథ్ (Minister Gudivada Amarnath) స్పందిస్తూ..చిరంజీవి అంటే తనకు గౌరవం ఉందని, అయితే ఆయన సినిమాలను రాజకీయాల్లోకి లాగవద్దని మాట్లాడినట్లుగా తెలిసిందని, కానీ అలా మొదట చేసింది ఎవరో తెలుసుకోవాలన్నారు. సినిమాలను రాజకీయాల్లోకి తెచ్చింది పవన్ కళ్యాణ్ అన్నారు. మళ్లీ దాడికి ప్రతిదాడి చేస్తే బాధపడుతున్నారన్నారు. అసలు బ్రో మూవీ లో మంత్రి అంబటి రాంబాబు పాత్రను సృష్టించింది ఎవరు? అని ప్రశ్నించారు అమర్నాధ్. ఆ పాత్ర అంబటిదేనని చెప్పే ధైర్యం కూడా వారికి లేదన్నారు. అసలు బ్రో సినిమాలో క్యారెక్టర్ పెట్టారో లేదో చెప్పగలరా? అన్నారు. తొలుత తమ్ముడికి జ్ఞానబోధ చేసి, ఆ తర్వాత రాజకీయ నాయకులకు సూచనలు చేయవచ్చునని చిరంజీవికి సలహా ఇచ్చారు.

ప్రస్తుతానికైతే ఎప్పుడు విమర్శలు చేసే మంత్రులు వచ్చారు..ఇక రావాల్సింది మంత్రి రోజానే..మరి చిరంజీవి (Chiranjeevi) ఫై కామెంట్స్ చేస్తుందా..? లేక సైలెంట్ గా ఉంటుందా అనేది చూడాలి. మరోవైపు నెటిజన్లు , అభిమానులు జనసేన శ్రేణులు మాత్రం అభివృద్ధి చెయ్యండి అని చెపితే చేస్తాం అని చెప్పే ధైర్యం లేదు కానీ..విమర్శలు చేయడానికి ముందుకు వస్తారని కామెంట్స్ వేస్తున్నారు. ఏది ఏమైనప్పటికి మరోసారి చిత్రసీమ అనేది వార్తల్లో నిలిచింది.

Read Also : Tollywood vs CM Jagan: చిరు వ్యాఖ్యల్ని సమర్ధించిన వైసీపీ రెబల్ ఎంపీ

Exit mobile version