Janasena : ఆరణి శ్రీనివాసులపై వైసీపీ నేతల దాడి

శనివారం నాడు గిరిపురంలో ఆరణి శ్రీనివాసులు ఎన్నికల ప్రచారం చేస్తుండగా వైసీపీ నాయకులు పోటీగా ప్రచారం చేశారు

  • Written By:
  • Publish Date - April 27, 2024 / 09:44 PM IST

ఏపీలో ఎన్నికల సమయం (AP Elections) దగ్గర పడుతున్న కొద్దీ ఉద్రిక్తత ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అధికార – ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల వార్ నడుస్తుండగా..మరోపక్క దాడులు చేస్తూ కూటమి శ్రేణుల్లో భయాందోళనకు గురి చేస్తున్నారు. శనివారం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీ ప్రచార వాహనాన్ని తగలపెట్టగా ..తిరుపతి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసుల (Arani Srinivasalu)ఫై దాడికి పాల్పడ్డారు వైసీపీ శ్రేణులు. ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతుండడంతో కూటమి నేతలు తమ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ప్రజలు నుండి కూడా విశేష స్పందన వస్తుండడంతో కూటమి అభ్యర్థులు మరింతగా దూకుడు పెంచుతున్నారు. ఈ తరుణంలో శనివారం నాడు గిరిపురంలో ఆరణి శ్రీనివాసులు ఎన్నికల ప్రచారం చేస్తుండగా వైసీపీ నాయకులు పోటీగా ప్రచారం చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్రమంలో వారు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసినప్పటికీ కూటమి శ్రేణులు సైలెంట్ గా ఉన్నారు. అయినప్పటికీ కూటమి కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. పలువురు ఎన్డీఏ కూటమి కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఈసీ అనుమతులతో ప్రచారం నిర్వహిస్తుండగా వైసీపీ నేతలు తమపై దాడి చేశారని ఆరణి శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా దాడులు చేస్తూ ప్రజల్లో భయం నింపాలని ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి కుట్ర పన్నుతున్నారని శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇలా కార్యకర్తలపై దాడి చేయడం సరికాదని, ఇదేవిధంగా దాడులు ప్రోత్సహిస్తే తగిన మూల్యం వైసీపీ చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. వైసీపీ అనైతిక చర్యలను కూటమి పార్టీలు సమర్థంగా ఎదుర్కొంటాయన్నారు. తిరుపతిలో ప్రశాంత వాతావరణాన్ని వైసీపీ చెడగొట్టాలని చూస్తోందని ధ్వజమెత్తారు.

Read Also : KTR : తెలంగాణ సీఎం ప్రజలను దశలవారీగా మోసం చేస్తున్నారు