AP : జనసేన నేత కర్రి మహేష్ ఇంటిపై పేర్ని కిట్టు అనుచరుల దాడి..

తాజాగా మచిలీపట్నంలో జనసేన నేత కర్రి మహేష్ ఇంటిపై వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు (YCP Candidate Parni Kittu) అనుచరుల దాడి పాల్పడ్డారు.

Published By: HashtagU Telugu Desk
Perni Kittu

Perni Kittu

ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ అధికార – ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో కొన్ని చోట్ల ఉద్రిక్తత ఘటనలు చోటుచేసుకున్నాయి. అధికార పార్టీ కి చెందిన నేతలకు సంబదించిన వారు..ప్రతిపక్ష పార్టీ నేతల ఫై దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా మచిలీపట్నంలో జనసేన నేత కర్రి మహేష్ ఇంటిపై వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు (YCP Candidate Parni Kittu) అనుచరుల దాడి పాల్పడ్డారు.

We’re now on WhatsApp. Click to Join.

గురువారం వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు విశ్వ బ్రాహ్మణ కాలనీలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో జనసేన నేత కర్రి మహేష్ ఇంటి ముందు పేర్ని కిట్టు అనుచరులు పెద్ద ఎత్తున బాణా సంచా కాల్చి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఇదంటని ప్రశ్నించడంతో పేర్ని కిట్టు అనుచులు రెచ్చిపోయారు. ఏకంగా కర్రి మహేష్ ఇంట్లోకి చొరబడి ఆడవాళ్ల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం, తోపులాటకు దారి తీసింది. ఈ ఘటనపై జనసేన నేత పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో మచిలీపట్నం పోలీస్ స్టేషన్ వద్ద జనసేన, టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

Read Also : Vaddiraju: కేసీఆర్ ఆదరణను చూసి ఓర్వలేకనే కాంగ్రెస్, బీజేపీ కుట్రలు : ఎంపీ వద్దిరాజు

  Last Updated: 02 May 2024, 06:17 PM IST