ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటైన తర్వాత వైసీపీ (YCP) హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా, అధికారాన్ని అడ్డుపెట్టుకుని అనుచిత వ్యాఖ్యలు చేసిన వారు, మహిళలను మరియు పిల్లలను కూడా టార్గెట్ చేసిన వారిపై పోలీసులు వరుసగా కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటి వరకు కింది స్థాయి వ్యక్తులను మాత్రమే అరెస్ట్ చేయగా, త్వరలోనే వీరి వెనుక ఉన్న అసలు దుండగులను కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ అరెస్టుల విషయంలో ప్రజల్లో పెద్దగా సానుభూతి లేకపోవడం, అంతేకాకుండా “ఇంత ఆలస్యం ఎందుకు?” అని ప్రశ్నించే వాళ్లు ఎక్కువగా ఉండడం గమనార్హం. అయితే, వైసీపీ మాత్రం తమ మద్దతుదారులను తప్పనిసరిగా సమర్థించాల్సిన పరిస్థితిలో పడిపోయింది.
National Science Day : సివి రామన్ , జాతీయ సైన్స్ దినోత్సవం మధ్య సంబంధం ఏమిటి..?
ప్రస్తుతం వల్లభనేని వంశీ (Vamshi), పోసాని కృష్ణమురళి(Posani)ల వ్యవహారాలు హాట్ టాపిక్‌గా మారాయి. వీరు తమ పదజాలంతో తీవ్ర వివాదాలకు తెరతీశారు. అయితే వీరి అరెస్టులకు వైసీపీ అనుకూలంగా స్పందించాల్సిన అవసరం జగన్‌కు తప్పని పరిస్థితిగా మారింది. వంశీ, పోసానిలను ప్రజలు సానుభూతితో చూడట్లేదని, పైగా వైసీపీ పరాజయానికి వీరిదీ కూడా ఓ కారణమని భావిస్తున్న వారే ఎక్కువగా ఉన్నారు. అయినప్పటికీ, వైసీపీ వారు వీరిని మద్దతివ్వక తప్పని పరిస్థితి. లేనిపక్షంలో “వాడుకుని వదిలేశారన్న” విమర్శలు ఎదురయ్యే అవకాశం ఉంది. జగన్ ముందుగా వంశీ అరెస్టుపై 36 గంటల పాటు మౌనం పాటించడం, తర్వాత స్పందించడం అనేది ఇది వ్యూహాత్మక చర్యగానే కనిపిస్తోంది. ఇప్పుడు పోసానికి కూడా అదే పరిస్థితి ఎదురుకావచ్చు.
YCP : ఛీ..పోసానిని ఇంకా సమర్థిస్తున్నారా..?
ఈ అరెస్టులు వైసీపీకి మరిన్ని ఇబ్బందులను కలిగించేలా తయారవుతున్నాయి. పోలీసులు వ్యూహాత్మకంగా చర్యలు తీసుకుంటూ ప్రజల్లో “వైసీపీ మళ్లీ మారదని” బలంగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. అరెస్టులు తప్పనిసరిగా చేయాల్సిన పరిస్థితిని సృష్టించి, వైసీపీ నాయకత్వం తప్పనిసరిగా మద్దతివ్వాల్సిన పరిస్థితిని కల్పించడం వెనుక ఓ స్ట్రాటజీ కనిపిస్తోంది. దీంతో ప్రజల్లో “వైసీపీ మళ్లీ అధికారంలోకి రావడానికి అర్హతలేని పార్టీ” అన్న అభిప్రాయం మరింత బలపడేలా చేస్తోంది. మొత్తం మీద జగన్ ఆనందం కోసం పోటీపడినవారంతా ఇప్పుడు జైలు ఊచలు లెక్క పెట్టేందుకు పోటీపడుతున్నారు.