Vizag : మూడు నెలల్లో విశాఖకు సీఎం.. వైజాగ్ సౌత్ ముంబై కాబోతుంది.. ఇదే రాజధాని..

ఎలక్షన్స్ దగ్గర పడుతున్న తరుణంలో అదే రాజధాని, అక్కడనుంచే పాలన త్వరలో అని వైసీపీ నాయకులు అంటూ వస్తున్నారు. తాజాగా మరోసారి విశాఖ రాజధాని వార్తల్లో నిలిచింది.

  • Written By:
  • Publish Date - August 5, 2023 / 10:00 PM IST

ఏపీ(AP)లో రాజధాని(Capital) అంశం రోజు రోజుకి చర్చల్లో నిలుస్తూనే ఉంది. వైసీపీ నాయకులు విశాఖ(Visakha)నే రాజధాని అని కూర్చున్నారు. ఎలక్షన్స్ దగ్గర పడుతున్న తరుణంలో అదే రాజధాని, అక్కడనుంచే పాలన త్వరలో అని వైసీపీ నాయకులు అంటూ వస్తున్నారు. తాజాగా మరోసారి విశాఖ రాజధాని వార్తల్లో నిలిచింది.

వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి(YV Subbareddy) నేడు వైజాగ్ లో జరిగిన వైజాగ్ – వన్ ఇండియా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైవీ సుబ్బారెడ్డి విశాఖ రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు.

వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాల ప్రజలు జీవించేందుకు అనువైన ప్రాంతం విశాఖ. వైజాగ్ అభివృద్ధిలో అన్ని ప్రాంతాల ప్రజల భాగస్వామ్యం ఉంది. త్వరలోనే విశాఖ పరిపాలన రాజదాని కాబోతుంది. లీగల్ ఇష్యూస్ వలన కాస్త ఆలస్యం అవుతుంది. రెండు మూడు నెలల్లో సీఎం విశాఖకు రాబోతున్నారు. దక్షిణ భారత దేశానికి ముంబయి లాంటిది విశాఖ. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎవరైనా వచ్చి ఇక్కడ ఉండొచ్చు అని అన్నారు. దీంతో రాజధానిపై సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు మరోసారి ఏపీ రాజకీయాల్లో చర్చగా మారాయి.

 

Also Read : AP : సర్పంచ్‌లు నిధుల కోసం రోడ్లపైకి రావాల్సిన దుస్థితికి జగన్ తీసుకొచ్చాడు – పవన్