Site icon HashtagU Telugu

AP Roads Video: రోడ్డు వేయాలంటూ ‘జగనన్న’కు పోర్లు దండాలు!

Ap Roads

Ap Roads

ఆంధ్రప్రదేశ్‌లోని రోడ్లు ఘోరంగా ఉన్నాయి. కనీసం నడవడానికి కూడా వీలులేకపోవడంతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీలైనంత త్వరగా రోడ్లను బాగు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీ నాయకులు, ప్రజలు అనేక నిరసనలు నిర్వహించారు. తమ గ్రామానికి రోడ్డు వేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ను కోరుతూ వైఎస్సార్‌సీపీ కార్యకర్త మట్టిరోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ ఘటన కడప జిల్లా బి మటం మండలం 15 వార్డులో చోటుచేసుకుంది. బ్రహ్మంగారి మఠం మండలం సోమిరెడ్డిపల్లి గ్రామానికి రోడ్డు లేదని వైఎస్‌ఆర్‌సీపీ వార్డు సభ్యుడు పొర్లు దండాలు నిర్వహిస్తూ జగన్ ప్రభుత్వాన్ని వేడుకున్నాడు.

తమ గ్రామానికి రోడ్డు వేయాలని గ్రామస్తులు పలుమార్లు మంత్రులకు, ఇతర నేతలకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.‘‘వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 1 క‌ల్లా రోడ్ల‌పై ఒక్క గుంత క‌న‌ప‌డ‌కూడ‌దంటూ మూడేళ్లుగా మ‌న ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గారు ప్ర‌తీ ఏటా ఇచ్చే స్టేట్ మెంట్స్ ఒక్క అక్ష‌ర‌మూ మార‌లేదు. రోడ్ల దుస్థితీ మార‌లేదు’’ అంటూ టీడీపీ నేత నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని హైలైట్ చేశారు.  జగన్ ప్రభుత్వం ఇప్పటికైనా రోడ్లు వేయాలని లోకేశ్ డిమాండ్ చేశాడు.