Site icon HashtagU Telugu

Kakani Govardhan Reddy : వైసీపీ నేత కాకాణికి హైకోర్టులో ఎదురుదెబ్బ !

YCP leader Kakani suffers setback in High Court!

YCP leader Kakani suffers setback in High Court!

Kakani Govardhan Reddy : హైకోర్టులో వైసీపీ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన క్వాష్​పిటీషన్​పై విచారణను కోర్టు రెండు వారాల పాటు వాయిదా వేసింది. దీంతోపాటు ఆయనకు కేసు నుంచి రక్షణ కల్పించేందుకు నిరాకరించింది. క్వార్ట్జ్‌ తవ్వకాలపై పొదలకూరులో నమోదైన కేసుకు సంబంధించి అరెస్ట్‌ విషయంలో తొందరపడకుండా పోలీసులను ఆదేశించాలని, పోలీసులు పెట్టిన కేసును కొట్టివేయాలని కాకాణి వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. క్వార్ట్జ్​అక్రమ రవాణా కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోసం మాజీ మంత్రి పిటీషన్​ వేశారు.

Read Also: Digital Registration System : ఇకపై ఏపీలో ఇంట్లో ఉండే భూ రిజిస్ట్రేష‌న్ చేసుకోవచ్చు..ఎలా అంటే !

ప్రస్తుతం కాకాణి గోవర్ధన్‌రెడ్డి అజ్ఞాతంలో ఉన్నారు. క్వార్ట్జ్‌ అక్రమ తవ్వకాలు, రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం తదితరాలపై పొదలకూరు పోలీసు స్టేషన్‌లో ఫిబ్రవరిలో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇందులో ఏ4గా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని చేర్చారు. అనంతరం విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. పోలీసులు ఇప్పటికే మూడుసార్లు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో ఆయన కోసం గాలిస్తున్నారు.

కాగా, కాకాణి హైదరాబాద్‌లోనే ఉన్నానంటూ ఫోన్లు, సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు పోస్టింగ్​లు వస్తున్నాయి. సెల్​ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు హైదరాబాద్​లోని ఇంటికి వెళ్లినా అక్కడ దొరకడం లేదు. హైకోర్టులో ఆయన వేసిన క్వాష్​పిటీషన్​విచారణకు వచ్చి తీర్పు వెలువడే వరకు ఆయన పోలీసుల విచారణకు హాజరు కాకుండా కాలం గడుపుతున్నారు. ఇప్పుడు కోర్టు తీర్పు నేపథ్యంలో ఆయనపై పోలీసులు చర్యలు చేపట్టేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఆయనను అరెస్టు చేసే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

Read Also: Yogi Adityanath : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో మంచు విష్ణు భేటీ