ఏపీలో ఎన్నికలు ఏమోగానీ ప్రజల ప్రాణాల మీదకు వచ్చాయి. పార్టీల అధినేతలు , బరిలో నిల్చున్న అభ్యర్థులు బాగానే ఉన్నప్పటికీ..కార్యకర్తలు మాత్రం ఒకరిపై ఒకరు దాడులకు తెగపడుతున్నారు. ఇకనైనా మరాండ్ర అంటే ఆబ్బె అంటూ దాడులు చేసుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా వైసీపీ శ్రేణులు పెద్ద మొత్తంలో దాడికి పాల్పడుతూ అందర్నీ భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఓటమి భయం తో ఇలా దాడులకు తెగపడుతున్నారా ..లేక మరేదైనా కారణం ఉందా అనేది క్లారిటీ లేనప్పటికీ నేతలపైనే కాదు టీడీపీ కి ఓటు వేశారని చెప్పి ఆ పార్టీ కార్యకర్తలపై , ఆఖరికి మహిళల ఫై కూడా దాడులు చేస్తున్నారు. వీరి దాడులకు సంబదించిన అనేక వార్తలు ప్రచారం అవుతూనే ఉన్నాయి. తాజాగా వైసీపీ కి కాదని టీడీపీ ఓటు వేసాడని చెప్పి ఓ వ్యక్తి చెవిని కోసేశాడు వైసీపీ శ్రేణి. ఈ ఘటన ప్రకాశం జిలాల్లో చోటుచేసుకుంది.
We’re now on WhatsApp. Click to Join.
వివరాల్లోకి వెళ్తే…
పందువ గ్రామానికి చెందిన తిమోతి రీసెంట్ గా వైసీపీని వీడి మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి సమక్షంలో టీడీపీలో చేరాడు. ఎన్నికల సమయంలో బంధువులు, చుట్టుపక్కల వారికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేసాడు. దీంతో తిమోతిపై స్థానిక వైసీపీ నేత గురవయ్య ఆగ్రహం పెంచుకున్నాడు. ఎలాగైనా తిమోతి ఫై దాడి చేయాలనీ అనుకున్నాడు. నిన్న రోడ్డుపై వెళ్తున్న తిమోతిపై కొడవలితో దాడి చేశాడు. ఈ దాడిలో తిమోతి చెవి తెగిపోయింది. గాయపడిన తిమోతిని కనిగిరి ఆసుపత్రిలో చేర్పించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదొక్కటే కాదు ఇలాంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలో జరిగాయి. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. మరి ఈ దాడులు ఎప్పుడు తగ్గుతాయి చూడాలి. ప్రస్తుతం మాత్రం పోలీసులు అనేక జిల్లాలో 144 సెక్షన్ కొనసాగిస్తూ అల్లర్లను తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు.
Read Also : Prabhas : ఇదెక్కడి కనెక్షన్‌రా బాబు.. ప్రభాస్ ఇన్‌స్టా పోస్ట్‌కి పాయల్ రాజ్‌పుత్‌కి డార్లింగ్ లింక్..