టాలీవుడ్ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి అరెస్ట్ (Posani Krishnamurali ) వ్యవహారం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. గత వైసీపీ (YCP) ప్రభుత్వ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), జనసేనాని పవన్ కళ్యాణ్, ఇతర నేతలపై పోసాని తీవ్ర వ్యాఖ్యలు చేసాడు. ప్రస్తుతం ఏపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పలు పోలీస్ స్టేషన్‌లలో ఆయనపై కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీ పోలీసులు బుధువారం రాత్రి హైదరాబాద్‌లోని తన నివాసంలో అరెస్ట్ చేసి ఏపీకి తరలించారు. కాసేపట్లో పోలీసులు కోర్ట్ లో హాజరుపరచనున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పోసాని అరెస్టును ఖండిస్తూ, ఆయన కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు.
Paresh Rawal: కాపీ కొట్టడం బాలీవుడ్ కి వెన్నతో పెట్టిన విద్య.. సంచలన వ్యాఖ్యలు చేసిన పరేశ్ రావల్!
పోసాని అరెస్టు విషయం తెలుసుకున్న జగన్, హైదరాబాదులోని పోసాని భార్య సుమలతకు ఫోన్ చేసి, ధైర్యం చెప్పినట్లు సమాచారం. ఈ కేసు రాజకీయ ప్రేరేపితమని ఆరోపించిన జగన్, ప్రస్తుతం ఏపీ కూటమి ప్రభుత్వం నిరంకుశంగా పాలన సాగిస్తోందని వ్యాఖ్యానించారు. పోసాని కృష్ణమురళికి వైసీపీ న్యాయపరంగా పూర్తి సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఇప్పటికే వైసీపీ సీనియర్ న్యాయవాదులను ఈ వ్యవహారంపై దృష్టి పెట్టాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. అలాగే పోసాని అరెస్టుపై వైసీపీ సీనియర్ నేతలతో జగన్ చర్చించినట్లు సమాచారం. టీడీపీలో జీవీ రెడ్డి అరెస్టు వ్యవహారంతో పోల్చుకుంటూ, ఈ చర్యను కూటమి ప్రభుత్వ డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.