YCP Key Leaders To Join TDP : ఒకేరోజు టీడీపీలో చేరిన ముగ్గురు వైసీపీ కీలక నేతలు..

ఏపీలో ఎన్నికల సమయం నాటికీ వైసీపీ (YCP) పార్టీ సగం ఖాళీ అవుతుందా..అంటే అవునంటే అంటున్నారు రాష్ట్ర ప్రజలు. జగనేమో 175 కు 175 సాదిస్తామని ధీమా వ్యక్తం చేస్తుంటే..ఆ పార్టీ నేతలు మాత్రం ఇంకా ఈ పార్టీ లో ఉంటె జనాలు కొట్టడం ఖాయం అంటూ ఒకరి వెనుక ఒకరు బయటకు వస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీ లు టీడీపీ (TDP) లో చేరగా..ఈరోజు ఏకంగా ముగ్గురు కీలక నేతలు చంద్రబాబు (Chandrababu) […]

Published By: HashtagU Telugu Desk
Ycp Key Leadersjoins Tdp

Ycp Key Leadersjoins Tdp

ఏపీలో ఎన్నికల సమయం నాటికీ వైసీపీ (YCP) పార్టీ సగం ఖాళీ అవుతుందా..అంటే అవునంటే అంటున్నారు రాష్ట్ర ప్రజలు. జగనేమో 175 కు 175 సాదిస్తామని ధీమా వ్యక్తం చేస్తుంటే..ఆ పార్టీ నేతలు మాత్రం ఇంకా ఈ పార్టీ లో ఉంటె జనాలు కొట్టడం ఖాయం అంటూ ఒకరి వెనుక ఒకరు బయటకు వస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీ లు టీడీపీ (TDP) లో చేరగా..ఈరోజు ఏకంగా ముగ్గురు కీలక నేతలు చంద్రబాబు (Chandrababu) సమక్షంలో టీడీపీ కండువా కప్పుకొని సంబరాలు నింపారు.

We’re now on WhatsApp. Click to Join.

వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సొంత బావమరిది మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథరెడ్డి (Dwarkanatha Reddy), సి.రామచంద్రయ్య (Ramachandraiah ), దాడి వీరభద్రం (Dadi Veerabhadra Rao) తో పాటు మరికొంతమంది చంద్రబాబు సమక్షంలో టీడీపీ లో చేరారు. ఇక ద్వారకానాథరెడ్డితో పాటు అన్న సురేంద్రనాథరెడ్డి, అక్క హరెమ్మ (తారకరత్న అత్త) టీడీపీ కండువా కప్పుకున్నారు.వైసీపీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్యకూడా చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన పార్టీలో చేరుతారని ఎవరూ అనుకోలేదు. కడప జిల్లాలో బలమైన బలిజ నేతగా ఉన్న ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరేందుకు వచ్చారు టీడీపీలో చేరిన అనంతరం సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచంద్రయ్య మాట్లాడుతూ.. మళ్లీ కోలుకోలేని విధంగా ఏపీని జగన్ అప్పులపాలు చేశారని ఆరోపించారు. దాడి వీరభద్రరావు కుటుంబంతో సహా టీడీపీ కంజువా కప్పుకున్నారు. అలాగే వివిధ నియోజకవర్గాలకు చెందిన వైసీపీ ముఖ్యనేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. అనంతపురం, చీరాల, బాపట్ల, పార్వతీపురంకు చెందిన వైసీపీ కార్యకర్తలు టీడీపీ గూటికి చేరారు. ఒకేసారి భారీ సంఖ్యలో వైసీపీకి చెందిన నేతలు టీడీపీలో చేరగా.. విజయసాయిరెడ్డి సొంత బంధువులే చేరడం పార్టీకి మరింత బలం పెంచినట్లు అయ్యింది. ఈ లెక్కన చూస్తే ఎన్నికల సమయం నాటికీ వైసీపీ ఖాళీ కావడం ఖాయమని టీడీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Read Also : Janasena : ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్‌కు కీలక బాధ్యతలు అప్పగించిన పవన్ కళ్యాణ్

  Last Updated: 03 Jan 2024, 06:40 PM IST