Konaseema Violence : కోన‌సీమ అల్ల‌ర్ల వెనుక‌ `అన్యంసాయి` ఎవ‌రు?

అమ‌లాపురం అల్ల‌ర్ల వెనుక సూత్ర‌ధారి అన్యం సాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • Written By:
  • Publish Date - May 25, 2022 / 09:00 PM IST

అమ‌లాపురం అల్ల‌ర్ల వెనుక సూత్ర‌ధారి అన్యం సాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయ‌న వైసీపీ పార్టీ చెందిన కార్య‌క‌ర్త‌. పైగా మంత్రి విశ్వ‌రూప్ కు అనుచ‌రుడిగా ఉన్నాడ‌ని తెలుస్తోంది. ఆయ‌న‌తో పాటు సుమారు 40 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచార‌ణ కొన‌సాగిస్తున్నారు. వీడియో ఫుటేజ్ ఆధారంగా అల్ల‌ర్ల‌కు పురికొల్పిన వాళ్ల‌ను పోలీసులు తెలుసుకున్నారు. అల్ల‌ర్ల‌పై ప్ర‌ధాన పార్టీలు ప‌ర‌స్ప‌రం ఆరోప‌ణ‌లు చేసుకుంటున్న త‌రుణంలో పోలీసు విచార‌ణ కీల‌కంగా మారింది. ఇప్ప‌టికే హోంమంత్రి తానేటి వ‌నిత మాట్లాడుతూ అల్ల‌ర్ల వెనుక జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు ఉన్నార‌ని నిర్థారించారు. ఆమె స్టేట్ మెంట్ పై జ‌న‌సేన చీఫ్ ప‌వ‌న్ సీరియ‌స్ గా స్పందించారు. ఫ‌లితంగా అన్యంసాయి చుట్టూ ఇప్పుడు రాజ‌కీయం న‌డుస్తోంది.

కోనసీమ జిల్లా పేరు మార్చవద్దని అల్లర్లకు కారణమైన అన్యం సాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.గతంలో కూడా కోనసీమ జిల్లా పేరు మార్చవద్దని అన్యం సాయి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు. కాగా అన్యం సాయిపై రౌడీ షీట్ కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అన్యం సాయి అనే వ్యక్తి మంత్రి విశ్వరూప్ అనుచరుడిగా చెబుతున్నారు. వైసీపీ కార్యకర్తగా ఉన్నాడు. అమ‌లాపురం విధ్వంసంలో అన్యం సాయి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. సీసీ కెమెరాలు పరిశీలించి పోలీసులు 40కి పైగా మందిని అరెస్ట్ చేశారు.

అన్యం సాయి అనే యువకుడికి వైసీపీ నేతలతో రాజకీయ సంబంధాలు ఉన్నాయని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీలో పనిచేస్తున్నారని కూడా జనసేన నేతలు చెబుతున్నారు. విజయసాయిరెడ్డి సజ్జల రామ కృష్నారెడ్డి వంటి కీలక నేతలతోనూ అన్యం సాయికి సంబంధాలుఉన్నాయని పేర్కొన్నారు. కొన్ని ఫొటోలను కూడా జనసేన పార్టీ విభాగం సోషల్ మీడియాకు విడుదల చేసింది. అసలు కోనసీమ అలజడి వెనుక వైసీపీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఉన్నాడని జనసేన నాయకులు ఆరోపించారు. ప్రశాంత్ కిశోర్ పక్కా ప్లాన్ ప్రకారమే కోనసీమపై అలజడి సృష్టించా రని అనుమానిస్తున్నారు.

కోనసీమ జిల్లా పేరు మార్చవద్దంటూ కొన్నాళ్లుగా జరిగిన ఉద్యమంలో అన్యం సాయి అనే యువకుడు ప్రధాన పాత్ర పోషించాడనికూడా జనసేన నేతలు తెలిపారు. ఇటీవల కలెక్టరేట్ ముట్టడి విషయంలో అత‌నే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడని పేర్కొన్నారు. ఈ విషయంలో జనసేనను అనవసరంగా లాగొద్దని అధికార పార్టీ నాయకులకు మంత్రులకు జనసేన సైనికులు విజ్ఞ‌ప్తి చేశారు. అంతేకాదు, అన్యంసాయి పుట్టుపూర్వోత్త‌రాల‌ను ఆరా తీశారు. ఆయ‌న‌కు వైసీపీ అగ్ర‌నేత‌ల‌తో ఉన్న సంబంధాల‌ను నిరూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. దీంతో అన్యంసాయి విచ్చే వాగ్మూలం అమ‌లాపురం అల్ల‌ర్ల వెనుక కుట్ర‌ను ఛేదించ‌నుంది.