YCP-Jagan : పెద్ద `రెడ్ల`తో పెట్టుకుంటే అంతే.! జ‌గ‌న్ రీ థింక్!

వ‌డ్ల ర‌కాలు ఎన్నో `రెడ్డి` సామాజిక‌వ‌ర్గంలోని(YCP-Jagan) ఉప కులాలు అన్ని ఉంటాయ‌ని పెద్ద‌ల సామెత‌.

  • Written By:
  • Publish Date - March 28, 2023 / 12:40 PM IST

(YCP-Jagan)వ‌డ్ల ర‌కాలు ఎన్నో `రెడ్డి` సామాజిక‌వ‌ర్గంలోని  ఉప కులాలు అన్ని ఉంటాయ‌ని పెద్ద‌ల సామెత‌. పంట‌, పాక‌నాటి, నేరేటి, మెటాటి, వెల‌నాటి, రేనాటి..ఇలా చాలా శాఖ‌లు బోలెడుఉన్నాయని చెబుతుంటారు. ప్ర‌ధానంగా పంట‌, పాక‌నాటి రెడ్డి (Reddy caste)సామాజిక వ‌ర్గాలు రాజ్యాధికారంలో మొద‌టి నుంచి ఎక్కువ‌గా ఉన్నారు. ఉమ్మ‌డి ఏపీ రాష్ట్రంలో ఎక్కువ‌గా పంట `రెడ్డి` ఎక్కువ‌గా అధికారంలో ఉంది. నెల్లూరు జిల్లాకు చెందిన బెజ‌వాడ గోపాలరెడ్డి త‌దిత‌రులు అంద‌రూ పంట రెడ్డి ల‌కు సంబంధించిన వాళ్లు. తొలి నుంచి ఆర్థికంగా బలంగా ఉన్న రెడ్డి సామాజిక‌వ‌ర్గంగా పంట రెడ్ల‌ను చెబుతుంటారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎక్కువ‌గా వాళ్లే ఉంటారు. అందుకే, నెల్లూరు పెద్ద రెడ్డిలు అంటుంటారు. వాళ్ల‌తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో..ఇప్పుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స్వ‌యంగా అనుభ‌విస్తున్నారు.

రెడ్డి` సామాజిక‌వ‌ర్గంలోని  ఉప కులాలు(YCP-Jagan)

తొలి నుంచి రాయ‌లసీమ రెడ్ల‌కు, కోస్తాంధ్ర‌లోని రెడ్ల‌కు(Reddy caste) పెద్ద‌గా సంబంధాలు ఉండేవి కావు. కాల‌క్ర‌మేణా రాజ‌కీయంగా అల్లుకుపోయారు. ఉమ్మ‌డి ఏపీలో కోస్తాంధ్రాకు చెందిన రెడ్ల పెత్త‌నం ఎక్కువ‌గా ఉండేది. అందులోనూ నెల్లూరు జిల్లాకు చెందిన బెడ‌వాడ గోపాల‌క్రిష్ణారెడ్డి, నేదుమ‌ల్లి జ‌నార్థ‌న్ రెడ్డి, మాగుంట సుబ్బ‌రామిరెడ్డి, న‌ల్ల‌పురెడ్డి శ్రీనివాసుల‌రెడ్డి, టీ సుబ్బిరామిరెడ్డి త‌దిత‌రులు ఉమ్మ‌డి ఏపీ రాజ‌కీయాన్ని ఏలారు.  గుంటూరు జిల్లాకు చెందిన కాసు బ్ర‌హ్మానంద‌రెడ్డి సీఎంగా చేసి ఉన్నారు. అంతేకాదు, నీలం సంజీవ‌రెడ్డి లాంటి వాళ్లు రాజ‌కీయంగా ఎంత ఎత్తుకు ఎదిగారో అంద‌రికీ తెలిసిందే. అప్ప‌ట్లో కోట్ల విజ‌య‌భాస్క‌ర్ రెడ్డి సీఎంగా చేసిన‌ప్ప‌టికీ నెల్లూరు రెడ్ల నుంచి ఎప్పుడూ వ్య‌తిరేక‌త ఉండేది. ఆ త‌రువాత రాయ‌ల‌సీమ నుంచి రెడ్డి సామాజిక‌వ‌ర్గంలో రాజ‌శేఖ‌ర్ రెడ్డి సీఎం(YCP-Jagan) అయ్యారు. ఆయ‌న హ‌యాంలో మాత్ర‌మే రాయ‌ల‌సీమ `రెడ్డి` సామాజిక‌వ‌ర్గం పెత్త‌నం తారాస్థాయికి వెళ్లింది. నెల్లూరు పెద్ద రెడ్లు కూడా రాజ‌శేఖ‌ర్ రెడ్డిని ఫాలో అయ్యారు.

రాయ‌లసీమ రెడ్ల‌కు, కోస్తాంధ్ర‌లోని రెడ్ల‌కు ..

స‌హ‌జంగా వాడుక భాష‌లో నెల్లూరు జిల్లాకు చెందిన రెడ్ల‌ను పెద్ద రెడ్లు అంటారు. ఎప్పుడూ రాజ్యాధికారం, పెత్త‌నం వాళ్ల వ‌ద్దే ఎక్కువ‌గా ఉండేది. అందుకేనేమో పెద్ద రెడ్లు (Reddy Caste)అంటారు. వాళ్లంటూ మిగిలిన ప్రాంతాల వాళ్ల‌కు కూడా ఎన‌లేని గౌర‌వం. బ‌హుశా ఆర్థికంగా బ‌లంగా ఉండ‌డం కార‌ణం కావ‌చ్చు. సినిమా నిర్మాణంలోనూ వాళ్లదే హ‌వా. ఆ గ్లామ‌ర్ కూడా నెల్లూరు పెద్ద రెడ్ల‌కు ఉంది. మొత్తంగా వాళ్ల‌తో పెట్టుకుంటే కూసాలు క‌దులుతాయ‌ని నానుడి ఉండేది. కాల‌క్ర‌మంలో ఆ నానుడి క‌నుమ‌రుగు అయిన‌ప్ప‌టికీ తాజా రాజ‌కీయ ప‌రిణామాలు మ‌రోసారి పాత వాస‌న‌లు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఎందుకంటే, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని బాహాటంగా వ్య‌తిరేకించే ధైర్యం చేసిన వాళ్లు నెల్లూరు పెద్ద రెడ్లే.

Also Read : Jagan Sketck: ఆ నలుగురిపై జగన్ స్కెచ్

బ‌ల‌మైన సీఎంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (YCP-Jagan)ఏపీలో ప్ర‌స్తుతం ఉన్నారు. ఆయ‌న్ను నాలుగేళ్లుగా ఎవ‌రూ ఏమీ అన‌లేని ప‌రిస్థితి. సొంత పార్టీలోని రెడ్లు కొంద‌రు అస‌హ‌నంతో చాలా కాలంగా ఉన్నారు. విప‌రీత పెత్త‌నాన్ని భ‌రించ‌లేక ఆనం నామ‌నారాయ‌ణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీథ‌ర్ రెడ్డి(Reddy Caste) తొలుత బ‌య‌ట పడ్డారు. అమ‌రావ‌తి విష‌యంలో గుంటూరు జిల్లా ప‌ల్నాడుకు చెందిన కొంద‌రు రెడ్డి సామాజిక‌వ‌ర్గం నేత‌లు అసంతృప్తిగా ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ లోలోప‌ల బాధ పడుతున్న‌ప్ప‌టికీ బ‌య‌ట‌ప‌డే ధైర్యం చేయ‌లేక‌పోయారు. ఇలాంటి ప‌రిస్థితి రాయ‌ల‌సీమ‌లోని వైసీపీ ఎమ్మెల్యేల్లో చాలా మందిలో ఉంద‌ని తెలుస్తోంది. ఆ విష‌యాన్ని రెబ‌ల్స్ గా మారిన ఆనం, కోటంరెడ్డి చెబుతున్నారు. ఇక సాయిరెడ్డి కూడా నెల్లూరు జిల్లాకు చెందిన పెద్ద రెడ్డే. ఆయ‌న కూడా ఇటీవ‌ల తాడేప‌ల్లి కోట‌రీకి దూరంగా ఉంటున్నారు. సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి, సాయిరెడ్డికి మ‌ధ్య ఏదో జ‌రుగుతుంద‌ని ఇటీవ‌ల వినిపిస్తోంది.

సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి, సాయిరెడ్డికి మ‌ధ్య ..

మొత్తం మీద రెడ్డి సామాజిక‌వ‌ర్గ నేప‌థ్యం, రాజ‌కీయ చ‌రిత్ర‌ను తీసుకుంటే ఉమ్మ‌డి ఏపీలో నెల్లూరు జిల్లాకు చెందిన పెద్ద రెడ్ల‌దే పెత్త‌నం ఎక్కువ‌గా ఉండేది. ఆనాటి నుంచి నెల్లూరు, రాయ‌ల‌సీమ రెడ్ల మ‌ధ్య వ్య‌త్యాసం ఉండేది. బ‌డా కాంట్రాక్ట‌ర్లు, నిర్మాత‌లు, రాజ‌కీయ నేత‌లు ఎక్కువ‌గా నెల్లూరు రెడ్లే క‌నిపించే వాళ్లు. ఫ్యాక్ష‌న్ నేపథ్యం ఉన్న రెడ్ల‌గా(Reddy Caste) రాయ‌ల‌సీమ మీద ఒక ముద్ర ఉండేది. ఇప్పుడిప్పుడే ఆ ముద్ర నుంచి బ‌య‌ట‌ప‌డి రాజ్యాధికారాన్ని ద‌క్కించుకున్నారు. ఆ త‌ర‌హా పాల‌న జీర్ణించుకోలేక ఆనం , కోటంరెడ్డి లాంటి వాళ్లు బ‌య‌ట‌కు వ‌చ్చారు. రాజ‌కీయాల్లోకి ఎందుకు వ‌చ్చామో ఆనంరామ నారాయ‌ణ రెడ్డి చాలా క్లుప్తంగా చెప్పారు. కుటుంబీకుల‌ను, స్నేహితుల‌ను చంప‌డానికి, అక్ర‌మ ఆస్తులు కూడ‌బెట్టుకోవ‌డానికి కాదంటూ ప‌రోక్షంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (YCP-Jagan)మీద మాట‌ల తూటాల‌ను పేల్చారు. ప్ర‌జాసేవ కోసం మాత్ర‌మే రాజ‌కీయాల్లోకి వ‌స్తామ‌ని, ఆయ‌న మ‌చ్చ‌లేని చ‌రిత్ర‌ను అవ‌లోకించారు.

Also Read : AP CM Jagan: జగన్ మంచోడే.! సజ్జలే చేటు!! రెబెల్స్ వాయిస్

ఇక ఉద‌య‌గిరి ఎమ్మెల్యే మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి కూడా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(YCP-Jagan) వ్య‌వ‌హారం మీద విరుచుకుప‌డ్డారు. ఆయ‌న‌కు తామే డ‌బ్బు ఇచ్చామ‌ని బ‌య‌ట‌పెట్టారు. తొలి నుంచి మేక‌పాటి కుటుంబం రాజ‌కీయాల్లో ఉంది. దాదాపుగా 40ఏళ్ల నుంచి రాజ‌కీయాల్లో ఉంటూ మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి ప‌లు ప‌ద‌వుల‌ను నిర్వ‌హించారు. ఇప్పుడు ఆయ‌న బ్ర‌ద‌ర్స్ వ‌చ్చారు. వాస్త‌వంగా అత్యంత పెద్ద కాంట్రాక్ట‌ర్ గా మేక‌పాటికి గుర్తింపు ఉంది. ఆ త‌రువాత రాజ‌కీయాల్లోకి టీడీపీ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు ఆ కుటుంబం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మీద విరుచుకుప‌డుతోంది. అలాగే, న‌ల్ల‌పురెడ్డి ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డి కూడా ఇటీవ‌ల జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ నిర్మిస్తోన్న ఇళ్ల గురించి చుర‌క‌లు వేశారు. అంటే, బానిస‌త్వాన్ని, విప‌రీత పెత్త‌నాన్ని నెల్లూరు రెడ్లు (Reddy Caste) జీర్ణించుకోలేర‌ని గ‌త చ‌రిత్ర చెబుతోంది. ఇప్పుడు కూడా అదే జ‌రుగుతుంద‌ని నెల్లూరు రెడ్ల నేప‌థ్యం గురించి తెలిసిన వాళ్లు చ‌ర్చించుకుంటున్నారు. ఈ ప‌రిణామం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ఎస‌రు పెడుతుంద‌ని నెల్లూరు పెద్ద రెడ్లను ద‌గ్గ‌ర నుంచి చూసిన వాళ్ల అభిప్రాయంగా చెబుతున్నారు.

Also Read : YCP-CBN : జ‌గ‌న్ `స్వ‌ర‌`ల‌హ‌రి, టీడీపీ బ‌హుప‌రాక్‌!