YCP : ఎమ్మెల్యేల‌కు జ‌గ‌న్‌ వార్నింగ్ ! త‌ప్పుకోవాల‌ని సంకేతాలు! లోకేష్‌పై ఉస్కో..!

ఎమ్మెల్యేలు, రీజిన‌ల్ కో ఆర్డినేట‌ర్ల‌కు వైసీపీ(YCP) శాశ్వ‌త అధ్య‌క్షుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి క్లాస్ తీసుకున్నారు.

  • Written By:
  • Updated On - February 13, 2023 / 04:31 PM IST

ఎమ్మెల్యేలు, రీజిన‌ల్ కో ఆర్డినేట‌ర్ల‌కు వైసీపీ(YCP) శాశ్వ‌త అధ్య‌క్షుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan)  సీరియస్  గా  క్లాస్ తీసుకున్నారు.  తాజాగా ఐ ప్యాక్ ఇచ్చిన స‌ర్వేను వాళ్ల ముందుంచారు. ఆయ‌న ఇచ్చిన టార్గెట్ ను క‌నీసం 50 శాతం మంది కూడా చేరుకోలేద‌ని తెలుస్తోంది. దీంతో అస‌హ‌నానికి గురైన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కొత్త  పంథాను ఎంచుకున్నారు. స్వచ్చందంగా  త‌ప్పుకోవాల‌ని సంకేతాలు ఇచ్చార‌ని పార్టీలోని అంత‌ర్గ‌త చ‌ర్చ‌. ఇప్పుడు మంత్రుల్లో క‌నీసం 12 మంత్రి గ్రాఫ్ అట్ట‌డుగున  ఉంద‌ని ఐ ప్యాక్ ఇచ్చిన స‌ర్వే సారాంశమట . అంతేకాదు, చాలా మంది మాజీ మంత్రుల గ్రాఫ్ అడ్ర‌స్ లేకుండా ఉంద‌ని  తాడేప‌ల్లి స‌ర్కిల్ లో టాక్‌.

వైసీపీ శాశ్వ‌త అధ్య‌క్షుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి  సీరియస్ క్లాస్..(YCP)

ప్రాంతీయ కో ఆర్డినేట‌ర్ల స‌మీక్ష‌లు, ఎమ్మెల్మేల క్షేత్ర‌స్థాయి ప‌ర్య‌ట‌న‌లు చేయ‌క‌పోవ‌డాన్ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (Jagan) సీరియ‌స్ గా తీసుకున్నార‌ని తెలుస్తోంది. గ‌త ఏడాది నిర్వ‌హించిన స‌మీక్ష‌లోనూ 60 నుంచి 70 మంది గ్రాఫ్ బాగాలేదు. వాళ్ల‌కు ఒక్క  ఛాన్స్ ఇస్తూ ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్ల‌డానికి బ్లూ ప్రింట్ ను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇచ్చారు. గ‌డ‌ప‌, గ‌డ‌ప‌కు ప్ర‌భుత్వం పేరుతో ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లాల‌ని సూచించారు. కొంద‌రు మాత్ర‌మే ఆ కార్య‌క్ర‌మాన్ని సీనియ‌స్ గా నిర్వ‌హించారు. చాలా మంది మొక్కుబ‌డిగా మాత్ర‌మే తీసుకున్నారు. ఆ విష‌యాన్ని ఐ ప్యాక్ స‌ర్వే ద్వారా తెలుసుకున్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి జ‌రుగుతోన్న న‌ష్టాన్ని స‌రిచేసే ప్ర‌య‌త్నంగా మ‌రో అవ‌కాశం ఇచ్చార‌ని తెలుస్తోంది. అయితే, ఏ ఒక్క‌రూ క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జాగ్ర‌హం గురించి చెప్ప‌లేకపోయార‌ట‌. ఎందుకంటే, ప్ర‌జా వ్య‌తిరేక‌త ..ఎమ్మెల్యేల (YCP) కార‌ణంగా వ‌చ్చింద‌ని తొలి స‌మావేశంలోనే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తేల్చారు. సుమారు 80 శాతం మంది త‌న పాల‌న‌కు సానుకూలంగా ఉన్నార‌ని అప్ప‌ట్లో ఇచ్చిన దిశానిర్దేశం.

Also Read : CM Jagan: మూడున్నరేళ్లలో జగన్ కట్టిన ఇళ్లు 5 మాత్రమే!

ప్లీన‌రీ జ‌రిగిన త‌రువాత ఇచ్చిన టార్గెట్ల‌ను 70శాతం మంది మంత్రులు పూర్తి చేయ‌లేద‌ని తెలుస్తోంది. గృహ సార‌థుల నియ‌మకాన్ని విజ‌య‌వంతం చేయ‌కపోవ‌డాన్ని సీరియ‌స్ గా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తీసుకున్నారు. గుజ‌రాత్, యూపీ రాష్ట్రాల్లో బీజేపీ మోడ‌ల్ ఎన్నిక‌ల ప్ర‌క్రియ ద్వారా అనుస‌రించాల‌ని ఆయ‌న భావించారు. ఆ మేర‌కు ప్ర‌తి 50 మంది ఓట‌ర్ల‌కు ఇద్ద‌రు గృహ సార‌థుల‌ను నియ‌మించాలని మూడు నెల‌ల క్రితం ఆదేశించారు. పోలింగ్ రోజు వ‌ర‌కు వాళ్లు జాగ్ర‌త్తగా ఉండాల‌ని, ఓట‌ర్ల‌కు అవ‌స‌రాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తీర్చాల‌ని దిశానిర్దేశం చేశారు. కానీ, ఎమ్మెల్యేలు, కో ఆర్డినేట‌ర్ల నుంచి స్పంద‌న అనుకున్నంత‌గా రాలేదు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల‌ను(YCP) ఎలా ఫేస్ చేయాలి? అంటూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఫుల్ క్లాస్ తీసుకున్నార‌ని తెలుస్తోంది.

వాలంటీర్లతో కలిసి గృహ సారథులు ఇళ్లను సందర్శించాల‌ని….

ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను తీసుకున్న ప్ర‌తి ల‌బ్దిదారుని ఇంటికి వెళ్లాల‌ని సోమ‌వారం పెట్టిన టార్గెట్‌. ఇదే ఎమ్మెల్యేలు, కో ఆర్డినేట‌ర్లు చివ‌రి అవ‌కాశమంటూ ఈనెల 20 నుంచి 27 వరకు 175 నియోజకవర్గాల్లోని 15 వేల సచివాలయాల్లో `జగనన్నే మా భవిష్యత్తు` కార్యక్రమాన్ని నిర్వ‌హించాల‌ని పిలుపునిచ్చారు. నియోజకవర్గ సమన్వయకర్తలు ప్ర‌తి రోజూ 25 నుంచి 30 ఇళ్లకు స్టిక్క‌ర్ల‌ను అంటిస్తూ ప్ర‌చారం నిర్వ‌హించాల‌ని సూచించార‌ని తెలుస్తోంది. వాలంటీర్లతో కలిసి గృహ సారథులు ఇళ్లను సందర్శించాల‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan) బ్లూ ప్రింట్ ఇచ్చారు. సచివాలయం కన్వీనర్లతో పాటు గ్రామ, వార్డు వాలంటీర్లు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనాల‌ని సూచించారు.

లోకేష్ వ్యాఖ్య‌ల‌ను తిప్పికొట్టాల‌ని సీరియ‌స్ గా…

సోమ‌వారం తాడేప‌ల్లి వ‌ద్ద జ‌రిగిన సుదీర్ఘ రివ్యూ మీటింగ్ లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan) ఎమ్మెల్యేల‌కు ఫుల్ క్లాస్ తీసుకున్నారు. స‌ర్వే రిపోర్టుల‌ను అందచేయ‌డంతో నోరెళ్ల‌బెట్ట‌డం సిట్టింగ్ వంతైయింద‌ని స‌మాచారం. ఇప్పుడున్న ఎమ్మెల్యేల్లో(YCP) 70శాతానికి పైగా డామ్ షూర్ గా గెల‌వ‌లేని ప‌రిస్థితుల్లో ఉన్నార‌ని ఐ ప్యాక్ ఇచ్చిన స‌ర్వేలోని సారాంశం. అంతేకాదు, సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌త్య‌ర్థి పార్టీకు ధీటుగా స‌మాధానం ఇవ్వ‌లేక‌పోతున్నార‌ని అస‌హ‌నం వ్యక్తం  చేసిన‌ట్టు తెలుస్తోంది. అధికార ప్ర‌తినిధులు, ఎమ్మెల్యేలు ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లోని అంశాల‌పై త‌ర‌చూ మీడియా ద్వారా ప్ర‌త్య‌ర్థుల‌ను ఎండ‌గ‌ట్టాల‌ని దిశానిర్దేశం చేశార‌ట‌. ఇటీవ‌ల పాద‌యాత్ర‌ను ప్రారంభించిన లోకేష్ వ్యాఖ్య‌ల‌ను తిప్పికొట్టాల‌ని సీరియ‌స్ గా చెప్పార‌ని తెలుస్తోంది. అందుకోసం ఒక ప్ర‌త్యేక టీమ్ ను రంగంలోకి దింపాల‌ని దిశానిర్దేశం చేసిన‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాల్లోని చ‌ర్చ‌.

Also Read : Jagan : ఎమ్మెల్యేల‌కు గ్రాఫ్ ద‌డ‌! ముగిసిన డెడ్ లైన్, 70 మందికి మూడిన‌ట్టే..!