Site icon HashtagU Telugu

YCP Jagan : నాడు మ‌రో ఎన్టీఆర్,ఎమ్జీఆర్ నేడు ప‌ల్నాడులో జ‌గన్ `సింహ‌`నాదం!

Jagan

Jagan Vinukonda

ఒక ఎన్టీఆర్, ఒక ఎంజీఆర్ అంటూ ఇటీవ‌ల త‌న‌కుతాను పోల్చుకున్న ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(YCP Jagan) తాజాగా సింహంగా అభివ‌ర్ణించుకున్నారు. `తోడేళ్లందరూ ఒక్కటవుతున్నారు. అయినా, భయపడకుండా మీ బిడ్డ సింహంలా ఒక్కడే ఎదురెళ్లుతున్నాడు` అంటూ వినుకొండ(Vinukonda) మీటింగ్ లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అన‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది. పొత్తుల క్ర‌మంలో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం క‌లిగిస్తున్నాయి. టీడీపీ, జ‌న‌సేన క‌లిసి ఎన్నిక‌ల‌కు సిద్ద‌మ‌వుతున్నాయ‌ని గ్ర‌హించిన ఆయ‌న ప్ర‌త్య‌ర్థుల‌ను తోడేళ్ల‌తో పోల్చారు.

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి  తాజాగా సింహంగా..(YCP Jagan)

వ‌చ్చే ఎన్నిక‌ల ప్ర‌చారానికి వినూత్న స్లోగ‌న్ అందుకున్నారు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(YCP Jagan). ఎన్నిక‌లు పేదవారికి, పెత్తందారులకు మధ్య యుద్ధంగా అభివ‌ర్ణించారు. వెన్నుపోట్లు, మోసాలకు పాల్పడే తుష్ట చ‌తుష్ట‌యాన్ని మీ బిడ్డ (జగన్) ఒంటరిగా ఎదుర్కొంటున్నాడని సానుభూతి యాంగిల్ తీసుకొచ్చే ప్ర‌య‌త్నం ఆయ‌న స్పీచ్ లో క‌నిపించింది. వ్యూహాత్మ‌కంగా చంద్ర‌బాబును ముస‌లాయ‌న అంటూ రాజ‌కీయ డ్యామేజ్ చేసే ప్ర‌య‌త్నం చేశారు. ప్ర‌జ‌లంద‌రూ ఒక వైపు దుష్ట‌చ‌తుష్ట‌యం మ‌రో వైపు అనే యాంగిల్ లో మైండ్ సెట్ చేయ‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మాస్ట‌ర్ ప్లాన్ వేశారు. ఆయ‌న స్పీచ్ లోని ప్ర‌తి మాట వెనుక రాజ‌కీయ ఎత్తుగ‌డ దాగి ఉంది.

Also Read : Jagan-CBN : జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వైఫ‌ల్యాలే చంద్ర‌బాబు విజ‌యానికి మెట్లు

నిరుపేద వర్గాలను నమ్ముకుని, వారికోసం పోరాడుతున్నానని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వివరించారు. తనకు ఎవరితోనూ పొత్తుల్లేవని, తాను ఎవరినీ నమ్ముకోలేదని తేల్చిచెప్పారు. తనకు ఉన్నదల్లా దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు మాత్రమేనని జగన్ స్పష్టం చేశారు. మిమ్మల్ని నమ్ముకున్నాడు కాబట్టే మీ బిడ్డ ధైర్యంగా ముందుకు అడుగేస్తున్నాడు అని జగన్ వెల్ల‌డించారు. మీ దీవెనలు బిడ్డపై ఉండాలని కోరుకుంటున్నట్లు జగన్ చెప్పారు. భ‌విష్య‌త్ లో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టేలా ఆశీర్వదించాలని ఆ దేవుడిని కోరుకుంటున్నానని అన్నారు. సోమవారం పల్నాడు జిల్లా వినుకొండ(Vinukonda)లో జరిగిన ‘జగనన్న చేదోడు’ మూడో విడత ఆర్థిక సాయం అందించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి పొలిటిక‌ల్ స్పీచ్ అద‌రగొట్టారు.

సంక్షేమాన్ని న‌మ్ముకున్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి

ముఖ్యమంత్రి ‘జగనన్న చేదోడు’ పథకం లబ్దిదారులకు చెందిన 3,30,145 బ్యాంకు ఖాతాల్లో రూ.330.15 కోట్లను బటన్ నొక్కి జమ చేశారు. రాష్ట్రంలోని చిన్న తరహా వ్యాపారుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన పథకమే జగనన్న చేదోడు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని దర్జీలు, రజకులు, నాయీ బ్రాహ్మణులకు ఏటా రూ.10 వేల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. సంక్షేమాన్ని న‌మ్ముకున్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి న‌వ‌ర‌త్నాల గురించి చెబుతూనే ప్ర‌జా సానుభూతిని పొందేలా మాట్లాడ‌డం గ‌మ‌నార్హం.

Also Read : Delhi Jagan : జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఢిల్లీ `కేస్` స్ట‌డీ ! వివేకా మ‌ర్డ‌ర్ విచార‌ణ మ‌ర్మం!!

రాష్ట్రంలో పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధం జరుగుతోందన్న ముఖ్యమంత్రి ప్ర‌జ‌ల్ని అప్ర‌మ‌త్తం చేయాల‌ని భావించారు. వెన్నుపోట్లు, మోసాలకు పాల్పడే వారిని ఒంటరిగా ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. పల్నాడు జిల్లాలో జరిగిన ‘జగనన్న చేదోడు’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగం ఆద్యంత‌మూ ఆస‌క్తిగా సాగింది. రాజ‌కీయ కోణం నుంచి సాగిన ఆయ‌న ప్ర‌సంగం ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని త‌ల‌పిస్తోంది.