వైసీపీ (YCP) హయాంలో ఎగిరెగిరి పడిన నేతల్లో బోరుగడ్డ అనిల్ కుమార్ (Borugadda anil kumar) ఒకరు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి(Jagan)పై అపారమైన అభిమానంతో, ప్రతిపక్ష నేతలను తీవ్ర స్థాయిలో విమర్శించే వ్యక్తిగా అనిల్ పేరు తెచ్చుకున్నారు. అయితే కొన్ని నెలల క్రితం పోలీసులు ఆయనను అరెస్టు చేయడంతో పరిస్థితి మారిపోయింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, వారి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం అనిల్ ను జైలు పాలుచేసింది. అరెస్టయిన తర్వాత వైసీపీ నాయకత్వం తనకు మద్దతుగా నిలుస్తుందని అనిల్ భావించినా, ఇప్పటి వరకు ఆ పార్టీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
Porn Sites Vs Bank Accounts: అశ్లీల సైట్ల పేరుతో స్కామ్.. బ్యాంకు అకౌంట్లు గుల్ల
ప్రస్తుతం బోరుగడ్డ అనిల్ రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నప్పటికీ, ఆయనను పరామర్శించేందుకు స్థానిక వైసీపీ నేతలు కూడా ఆసక్తి చూపడం లేదు. వైసీపీ అధికారికంగా ఈ వ్యవహారంపై స్పందించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు ఆయన వీడియోలను విపరీతంగా ప్రచారం చేసిన వైసీపీ సోషల్ మీడియా కూడా ఇప్పుడు సైలెంట్ అయ్యింది. ఇదే విధంగా ఇటీవల అరెస్టయిన మాజీ ఎంపీ నందిగం సురేష్ విషయంలోనూ పార్టీ పెద్దలు మౌనం పాటిస్తున్నారు.
Manchu Family -TDP MLA : మంచు ఫ్యామిలీకి బొజ్జల సుధీర్ రెడ్డి మద్దతు – పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి
ఇక బోరుగడ్డ అనిల్ అరెస్టు వెనుక చాలా కారణాలు ఉన్నాయని, ఆయన గతంలో కొన్ని షాపుల యజమానులను బెదిరించి వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయని సమాచారం. అదనంగా అక్రమ మద్యం వ్యాపారంలోనూ ఆయన ప్రమేయం ఉందని పోలీసులు ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. కొన్ని ఘటనల్లో బెదిరింపులు, హత్యాయత్నాలకు సంబంధించిన కేసులు కూడా అనిల్‌పై నమోదు కావడం, ఆయనకు బెయిల్ లభించే అవకాశాలను తగ్గించాయి. హైకోర్టు కూడా ఈ కేసును తీవ్రంగా పరిగణిస్తూ, కొంతకాలం పాటు అనిల్ జైలులో ఉండటమే మంచిదని అభిప్రాయంకు వచ్చింది. ఇవన్నీ చూసి వైసీపీ…అనిల్ కు దూరం గా ఉన్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికి పార్టీ నేతల అరెస్ట్ లు..అధిష్టానం పట్టించుకోకపోవడం పార్టీ పై విమర్శలు ఎక్కువ అవుతున్నాయి.