ఇటీవల ఏపీలో జరిగిన అసెంబ్లీ , లోక్ సభ ఎన్నికల (Assembly and Lok Sabha elections) కోసం ఎంత ఖర్చు చేశారనేది వైసీపీ (YCP) పార్టీ .. ఎన్నికల సంఘానికి నివేదిక సమర్పించింది. ఈ నివేదికలో ఎన్నికల ప్రచార ఖర్చు, అభ్యర్థుల కోసం రూ. 328,36,60,046 ఖర్చు చేసినట్లు పేర్కొంది. అలాగే స్టార్ క్యాంపెయినర్ల ప్రయాణం కోసం రూ. 21.42 కోట్లు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా, బల్క్ ఎస్సెమ్మెస్‌లు, కేబుల్, వెబ్‌సైట్, టీవీ చానళ్లలో పార్టీ సాధారణ ప్రచారం కోసం రూ. 87.36 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలిపింది. ఇక, స్టార్ క్యాంపెయినర్ల కోసం చేసిన మొత్తం ఖర్చులో రూ. 21.41 కోట్లు ఒక్క జగన్ హెలికాప్టర్, విమానం, బస్సుల కోసమే వెచ్చించినట్టు నివేదికలో పేర్కొంది. ఈ ఖర్చు అంత ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మార్చి 16 నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసిన జూన్ 6 వరకు ఖర్చు చేసినట్లు ఈసీ కి తెలిపింది.
అలాగే కాంగ్రెస్ పార్టీ సైతం తమ ఖర్చు ను తెలుపడం జరిగింది. రీసెంట్గా జరిగిన లోక్‌సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల(ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం) అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ దాదాపు రూ.585 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొంది. ప్రకటనలు, మీడియా ప్రచారానికి రూ.410 కోట్లు, సోషల్ మీడియా యాప్‌లు ఇతర మార్గాల్లో వర్చువల్ ప్రచారాలకు దాదాపు రూ.46 కోట్ల ఖర్చు చేసినట్లు వెల్లడించింది. మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితర స్టార్ క్యాంపెయినర్ల విమాన ప్రయాణాలకు దాదాపు రూ.105 కోట్లు ఖర్చయినట్లు, ప్రచారంలో పోస్టర్లు, బ్యానర్లు, హోర్డింగ్‌లు, ఇతర ప్రచార సామగ్రి ముద్రణకు రూ.68.62 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపింది.
Read Also : Ratan Tata: 2016లో షేర్లు కొనుగోలు చేసిన రతన్ టాటా.. నేడు వాటి ధర ఎంతంటే..?