Current charges increase : విద్యుత్ చార్జీల పెంపు పై వైసీపీ పోరుబాట

రాష్ట్ర ప్రజలపై రూ. 15 వేల కోట్ల అదనపు భారం మోపిందని ఆరోపించింది. ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Published By: HashtagU Telugu Desk
YCP fight over increase in electricity charges

YCP fight over increase in electricity charges

Current charges increase : ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇప్పటికే పెంచిన చార్జీలతో ప్రతిపాదనలు ప్రభుత్వం ముందుంచారు అధికారులు. చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే భారీగా విద్యుత్‌ ఛార్జీలు పెంచిందని ఆరోపిస్తు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను నిర్వహించింది. రాష్ట్ర ప్రజలపై రూ. 15 వేల కోట్ల అదనపు భారం మోపిందని ఆరోపించింది. ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

అయితే నగరిలోని ఈ నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి రోజా పాల్గొన్నారు. ఓటేసిన ప్రజలను చంద్రబాబు ప్రభుత్వం కాటేస్తుందని ఆరోపించారు. బాబు ష్యురిటీ.. బాదుడు గ్యారంటీ అన్నట్లుగా చంద్రబాబు పాలన ఉందని విమర్శించారు.

మరోవైపు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి చిత్తూరు జిల్లా కేంద్రంలో నిర్వహించిన నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గతంలో విద్యుత్‌ బిల్లులు తగ్గించాలని రైతులు డిమాండ్‌ చేస్తే వారిపై కాల్పులు జరిపిన ఘనుడు చంద్రబాబు అన్ని ఆరోపించారు. రాష్ట్రంలో విద్యుత్‌ బిల్లుల పేరుతో ప్రజలను దోపిడీ చేస్తున్నారని, ఎన్నికలకు ముందు మాటలకు ఇప్పటి చేతలకు సంబంధం లేదని పేర్కొన్నారు. అమరావతికి లక్ష కోట్లు ఖర్చు చేస్తే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏమిటని పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ప్రశ్నించారు.

ఇక, ఈ ఏడాది జనవరి 1నుంచి పెంపు నిర్ణయం వాయిదా వేయాలని కొన్ని వర్గాల నుంచి ప్రభుత్వానికి వినతులు వచ్చాయి. వచ్చే సోమవారం క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నాయి రిజిస్ట్రార్ శాఖ వర్గాలు. దీంతో ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుపై సస్పెన్షన్‌ నెలకొంది. మరి దీనిపై చంద్రబాబు నాయుడు సర్కార్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Read Also: NTR – Charan : ఎన్టీఆర్ కు ఎక్కడ దెబ్బ తగిలిందో అని చరణ్ కన్నీరు

  Last Updated: 27 Dec 2024, 02:08 PM IST