Site icon HashtagU Telugu

YCP : వైసీపీ నుండి మరో లిస్ట్ అంటూ ఫేక్ న్యూస్ వైరల్..

Ycp Fake News

Ycp Fake News

ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతుండడం తో వైసీపీ అధినేత, సీఎం జగన్ (CM Jagan) పార్టీలో మార్పులు , చేర్పులు చేస్తున్నారు. ముఖ్యంగా అభ్యర్థుల మార్పు ఫై దృష్టి సారించారు. నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఫై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని వారిని మార్చేస్తున్నారు. ఈసారి దాదాపు 100 మందికి పైగా టికెట్స్ ఇవ్వడం లేదని తెలుస్తుంది. ఇప్పటికే ఈ విషయాన్నీ ఆయా నేతలకు చెప్పడం మొదలుపెట్టారు. వీరిలో మంత్రులు కూడా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే 11 నియోజకవర్గాల ఇన్ఛార్జ్లను మార్చేయడం జరిగింది. మరికొన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జ్లను మార్చబోతుందని వార్తలు ప్రచారం జరుగుతుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ తరుణంలో ఓ ఫేక్ ప్రెస్ నోట్ వైరల్ గా మారడం ఫై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. 8 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చినట్లు ఓ ఫేక్ ప్రెస్ నోట్ (Fake Press Note) లో అభ్యర్థుల మార్పు తాలూకా వివరాలు తెలిపారు. వారిలో ఎవరెవరు ఉన్నారంటే..

Read Also :