YCP Fake Notes : చీక‌టి వ్యాపారాల్లో దొంగ‌నోట్లు, గుట్టువిప్పిన బెంగుళూరు పోలీస్‌

దొంగ నోట్ల వ్య‌వ‌హారంలోనూ వైసీపీ లీడ‌ర్ల ప్ర‌మేయం ఉంద‌ని తేలింది.

  • Written By:
  • Updated On - January 25, 2023 / 04:02 PM IST

ఏపీలోని వైసీపీ నేత‌లు కొంద‌రు అసాంఘిక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్నారు. డ్ర‌గ్స్, గంజాయి నుంచి ల్యాండ్ మాఫియా వ‌ర‌కు వాళ్లే ఉంటున్నారు. ఆ విష‌యాన్ని తెలుగుదేశం పార్టీ ప‌లు సంద‌ర్భాల్లో చెప్పింది. కొంద‌రు ఎమ్మెల్యేలు ఇలాంటి చీక‌టి వ్యాపారాల‌ను(YCP Fake Notes) చేస్తున్నారు. కాకినాడ ఓడ‌రేవు కేంద్రంగా ఎమ్మెల్యే చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి చేస్తోన్న బియ్యం స్మ‌గ్లింగ్ వ్య‌వ‌హారాన్ని బ‌య‌ట పెట్టింది. గుజరాత్ లోని ఓడ‌రేవుల నుంచి ఎలా డ్ర‌గ్స్ స్మ గ్లింగ్ (smuggling) జ‌రుగుతుంద‌నే విష‌యాన్ని టీడీపీ కొన్ని ఆధారాల‌తో మీడియాకు వెల్ల‌డించింది. అసెంబ్లీలోనూ టీడీపీ ప‌లు సంద‌ర్బాల్లో అధికార‌ప‌క్షాన్ని నిల‌దీసింది.

కొంద‌రు ఎమ్మెల్యేలు చీక‌టి వ్యాపారాల‌ను ..(YCP Fake Notes)

తాజాగా దొంగ నోట్లను మార్చే వ్య‌వ‌హారంలోనూ వైసీపీ లీడ‌ర్ల ప్ర‌మేయం ఉంద‌ని తేలింది. ఆ పార్టీకి చెందిన మ‌హిళా నేత న‌కిలీ నోట్ల(YCP Fake Notes) చలామణి కేసులో చిక్కింది. వైసీపీ మహిళా నేత రసపుత్ర రజినిని బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెతో పాటు చరణ్ సింగ్ అనే మరో నిందితుడిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. వాళ్ల నుంచి రూ.44 లక్షల విలువైన రూ.500 నోట్లు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర బొందిలి కార్పొరేషన్ డైరెక్టర్ గా ఇటీవ‌ల ప‌ద‌వీ విర‌మ‌ణ పొందారు. ఆమెకు మ‌రోసారి ప‌ద‌విని కొన‌సాగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

Also Read : Drugs Kingpin Arrested: కీలక ఘట్టం.. డ్రగ్స్ కింగ్‌పిన్ అరెస్ట్.!

కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన రసపుత్ర రజిని వైసీపీ కీల‌క మ‌హిళా లీడ‌ర్ గా చెలామ‌ణి అవుతున్నారు. అధికార పార్టీ వైసీపీలో యాక్టివ్ గా ఉంటారు. ఆమె నుంచి రూ.44 లక్షల విలువైన నకిలీ 500 నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్ల‌డించారు. అనంతపురం పట్టణానికి చెందిన కొంతమంది వ్యక్తుల నుంచి నకిలీ నోట్లు కొనుగోలు చేసేద‌ని పోలీసులు గుర్తించారు. ఆ నోట్ల‌ను బెంగళూరులో సర్క్యులేట్ చేస్తున్నట్లు పోలీసులు నిర్థారించారు. దొంగనోట్ల వ్యవహారంతో తనకేం సంబంధంలేదని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఈ వ్యవహారంలో రజిని పాత్ర ఉందని తేలితే పార్టీ పరంగా ఆమెపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

గంజాయి, మద్యం సిండికేట్ల వ్య‌వహారం

పేద‌ల‌కు ఇళ్ల స్థలాల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా జ‌రిగిన ల్యాండ్ మాఫియా వ్య‌వ‌హారం అప్ప‌ట్లో బ‌య‌ట‌కు వ‌చ్చింది. దానిపై టీడీపీ పెద్ద ఎత్తున ధ‌ర్నాలు, ఆందోళ‌న‌లు చేసింది. ఎమ్మెల్యేలు చాలా మంది భూ స‌మీక‌ర‌ణ‌, సేక‌ర‌ణ విష‌యంలో జోక్యం చేసుకుని కోట్లాది రూపాయ‌లు దోచేశారు. కొన్ని చోట్ల క‌లెక్ట‌ర్ల‌తో ఎమ్మెల్యేలు వాగ్వాదానికి దిగారు. భూముల‌ను కొనుగోలు చేయ‌డంతో పాటు వాటిని చ‌దును చేసి ప్లాట్లు వేసే వ‌ర‌కు కొంద‌రు ఎమ్మెల్యే పాత్ర అవినీతి మ‌యంగా మారింది. ఆ త‌రువాత గంజాయి, మద్యం సిండికేట్ల వ్య‌వహారం బ‌య‌ట‌కు వ‌చ్చింది. డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం కొంత కాలం వైసీపీ లీడ‌ర్ల‌ను అమాంతం పైకి తీసుకొచ్చింది. తాజాగా దొంగ నోట్ల వ్య‌వ‌హారం కూడా బ‌య‌ట‌కు రావ‌డంతో వైసీపీ ప్ర‌జాక్షేత్రంలో ప‌లుచ‌న అయింది. ఇదే విష‌యాన్ని విప‌క్ష నేత‌లు చెబుతూ చీక‌టి వ్యాపారాలు(smuggling) చేస్తూ రాష్ట్రాన్ని అధిగ‌తిపాలు చేస్తున్నార‌ని ఆరోపిస్తున్నారు.

Also Read : Drugs : డ్రగ్స్ ముఠా గుట్టు ర‌ట్టు చేసిన చిత్తూరు పోలీసులు.. ఆరుగురు అరెస్ట్‌