Site icon HashtagU Telugu

YCP District Presidents : జ‌గ‌న్ ఎన్నిక‌ల టీమ్ ఇదే.!  

YCP District Presidents

Jagan

వైసీపీ శాశ్వ‌త అధ్య‌క్షుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి  (YCP District Presidents)ఎప్పుడూ రాజ‌కీయాల గురించి ఆలోచిస్తుంటారు. ఫ‌క్తు రాజ‌కీయాల‌ను చేస్తుంటారు. ప్ర‌త్యర్థి పార్టీల లీడ‌ర్ల‌ను శ‌త్రువులుగా భావిస్తుంటారు. ప్ర‌త్య‌ర్థులుగా భావించ‌డానికి ఆయ‌న మ‌న‌సు అంగీక‌రించద‌ని వైసీపీ పార్టీలోని టాక్‌. అందుకే, శ‌త్రు శేషం లేకుండా చేసుకోవ‌డానికి ప్ర‌త్య‌ర్థుల ఆర్థిక మూలాల మీద దెబ్బ‌కొట్ట‌డం ఆయ‌న తొలి అస్త్రం. ఆ త‌రువాత రాజ‌కీయంగా బ‌ల‌హీన‌ప‌రచ‌డం రెండో శ‌స్త్రం. ఆ దిశ‌గా అడుగులు వేస్తోన్న ఆయ‌న తాజాగా జిల్లా అధ్య‌క్షుల‌ను మార్చేశారు. ఎన్నిక‌ల టీమ్ ను సిద్ధం చేస్తూ జిల్లా అధ్య‌క్షుల‌ను ప్ర‌క‌టించారు.

జిల్లాల వారీగా 25 మంది అధ్య‌క్షుల‌ను నియ‌మిస్తూ నిర్ణ‌యం (YCP District Presidents)

సాధార‌ణంగా రాజ‌కీయ పార్టీలు సామాజిక స‌మీక‌ర‌ణాలకు ప్రాధాన్యం ఇస్తూ సంస్థాగ‌త నియామ‌కాలు జ‌రుపుతాయి. నామినేటెడ్ పోస్టుల నుంచి ఎమ్మెల్యే అభ్య‌ర్థుల వ‌ర‌కు సామాజిక ఈక్వేష‌న్ అంటూ చెబుతుంటారు. కానీ, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అలాంటి పద్ధ‌తికి స్వ‌స్తి ఎప్పుడో చెప్పారు. ప్ర‌భుత్వ స‌ల‌హాదారులుగా సామాజిక స‌మీక‌ర‌ణాల‌కు భిన్నంగా నియ‌మించారు. కీల‌క పోస్టుల్లో సొంత సామాజిక‌వ‌ర్గానికి  (YCP District Presidents)పెద్ద పీఠ వేశారు. మంత్రివ‌ర్గంలో మాత్రం ఆర్థికంగా బ‌ల‌మైన వాళ్ల‌కు స్థానం క‌ల్పిస్తూ సామాజిక ఈక్వేష‌న్ తీసుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇప్పుడు జిల్లా అధ్య‌క్షుల విష‌యంలోనూ రాబోవు ఎన్నిక‌ల్లో తాడేపేడో తేల్చుకోవ‌డానికి సిద్ద‌ప‌డే వాళ్ల‌ను ఎంపిక చేశారు. సామాజిక ఈక్వేష‌న్ల‌ను ప‌క్క‌న పెట్టేశార‌ని ఆ జాబితాను (YCP District Presidents) ప‌రిశీలిస్తే అర్థ‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం విభ‌జించిన జిల్లాల వారీగా 25 మంది అధ్య‌క్షుల‌ను నియ‌మిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. ఆయా జిల్లాల వారీగా అధ్య‌క్షుల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

జిల్లాల వారీగా అధ్య‌క్షుల వివ‌రాలు ఇలా

అల్లూరి సీతారామరాజు: కొట్టగుల్లి భాగ్యలక్ష్మి (ఎమ్మెల్యే)
అనకాపల్లి: బొడ్డేట ప్రసాద్
అనంతపురం: పైలా నరసింహయ్య
అన్నమయ్య: గడికోట శ్రీకాంత్ రెడ్డి (ఎమ్మెల్యే)
బాపట్ల: మోపిదేవి వెంకటరమణ (ఎంపీ)
చిత్తూరు: భరత్ (ఎమ్మెల్సీ)
కోనసీమ: పొన్నాడ వెంకట సతీష్ కుమార్ (ఎమ్మెల్యే)
ఈస్ట్ గోదావరి: జక్కంపూడి రాజా (ఎమ్మెల్యే)
ఏలూరు: ఆళ్ల నాని (ఎమ్మెల్యే)
గుంటూరు: డొక్కా మాణిక్య వరప్రసాద్
కాకినాడ: కురసాల కన్నబాబు (ఎమ్మెల్యే)
కృష్ణా: పేర్ని నాని (ఎమ్మెల్యే)

Also Read Jagan CPS : ఉద్యోగుల‌పై జ‌గ‌న్ స‌వారీ

కర్నూలు: వై బాలనాగిరెడ్డి (ఎమ్మెల్యే)
నంద్యాల: కాటసాని రాంభూపాల్ రెడ్డి (ఎమ్మెల్యే)
ఎన్టీఆర్ జిల్లా: వెల్లంపల్లి శ్రీనివాస్ (ఎమ్మెల్యే)
పల్నాడు జిల్లా: పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (ఎమ్మెల్యే)
పార్వతీపురం మన్యం: శత్రుచర్ల పరీక్షిత్ రాజు
ప్రకాశం: జంకె వెంకటరెడ్డి
నెల్లూరు: వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (ఎంపీ)

Also Read : Jagan Effect : APలోనూ`బండి`కి క‌ళ్లెం?TTDపై ఢిల్లీ BJP లైట్.!

సత్యసాయి: ఎం శంకరనారాయణ (ఎమ్మెల్యే)
శ్రీకాకుళం: ధర్మాన కృష్ణదాస్ (ఎమ్మెల్యే)
తిరుపతి: నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి
విజయనగరం: మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), జడ్పీ చైర్మన్
వెస్ట్ గోదావరి: చెరుకువాడ శ్రీరంగనాథరాజు (ఎమ్మెల్యే)
వైఎస్సార్: కె. సురేశ్ బాబు (మేయర్).

Also Read : YCP Luck : జ‌గ‌న్ కు మేలుచేసేలా ప‌వ‌నిజం

Exit mobile version