YCP Criminal status : YCP నేర‌ చిట్టా విప్పిన CBN! జ‌గ‌న్ జ‌మానాలో 70శాతం పెరిగిన‌ కోర్టు ఖ‌ర్చు!!

చ‌ట్టం ప్ర‌కారం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నిందితుడి(YCP Criminal status) మాత్ర‌మే నేర‌స్తుడు కాదు. ఆయ‌న్ను ఆర్థిక నేర‌స్తుడు అన‌డానికి లేదు.

  • Written By:
  • Updated On - May 24, 2023 / 04:29 PM IST

చ‌ట్టం ప్ర‌కారం ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నిందితుడి(YCP Criminal status) మాత్ర‌మే నేర‌స్తుడు కాదు. ఆయ‌న్ను ఆర్థిక నేర‌స్తుడు అన‌డానికి లేదు. కానీ, ప్ర‌త్య‌ర్థి పార్టీలు మాత్రం ఆయ‌న్ను నేరస్తుడిగా, సైకోగా సంబోధిస్తుంటారు. న్యాయ‌స్థానాల్లోనే కాదు, అమెరికా (America)దేశంలోని యూనివ‌ర్సిటీల్లో కూడా కేస్ స్ట‌డీగా ఆయ‌న మీద ఉన్న కేసుల‌ను చూపిస్తున్నారు. గూగూల్ సైతం 6093 అని టైప్ చేస్తే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మీద ఉన్న కేసుల్ని చెబుతోంది. ఖైదీనెంబ‌ర్ 6093 అని టైప్ చేస్తే ఆయ‌న నేర‌చ‌రిత్రను వీడియోలు, ఆడియోలు, రాత‌పూర్వ‌కంగా తెలియ‌చేస్తోంది.

వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేల మీద 408 క్రిమిన‌ల్ కేసులు (YCP Criminal status)

సీబీఐ, ఈడీ కేసులు ప్రూ కాలేదు క‌నుక జ‌గ‌న్మోహన్ రెడ్డిని నేర‌స్తుడు(YCP Criminal status) అన‌డం ఏమిటి? అంటూ వైసీపీ ప్ర‌శ్నిస్తోంది. అక్ర‌మంగా సంపాదించిన డ‌బ్బు ల‌క్ష‌ల కోట్లు అంటూ విచార‌ణ చేసిన కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు కేవ‌లం 33వేల కోట్లకు మాత్ర‌మే అటాచ్ చేసింది. ఆ మొత్తానికి సంబంధించిన అంశాల‌పై విచార‌ణ కొన‌సాగుతోంది. క్లీన్ చిట్ తో కేసుల నుంచి బ‌య‌ట‌కు వ‌స్తారు. అప్ప‌టి వ‌ర‌కు నేర‌స్తుని ముద్ర వేయ‌డానికి లేద‌ని వైసీపీ తొలి నుంచి వాదిస్తోంది. న్యాయ‌శాస్త్రం ప్ర‌కారం కూడా కోర్టుల్లో కేసు విచార‌ణ పూర్తి కాకుండా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని మాత్ర‌మే కాదు, ఎవ‌ర్నైనా ముద్దాయి అన‌డానికి లేదు. కానీ, య‌ధేచ్చ‌గా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని ఆర్థిక నేర‌స్తుడు అంటూ ప్ర‌త్య‌ర్థి పార్టీ ప‌లు వేదిక‌ల‌పై చెబుతోంది.

జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మీద  31 క్రిమిన‌ల్ కేసులు

వాస్త‌వంగా ప్ర‌త్య‌ర్థి పార్టీలు చేస్తోన్న ఆరోప‌ణ‌ల మీద న‌ష్ట‌ప‌రిహారం కింద కేసులు వేయ‌డానికి వైసీపీకి అవ‌కాశం ఉంది.కానీ, ఎక్క‌డా న‌ష్ట‌ప‌రిహారం కింద కేసులను ప్ర‌త్య‌ర్థి పార్టీల లీడ‌ర్ల మీద వేయ‌లేదు. ప్ర‌జాక్షేత్రంలో మాత్రం ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు ధీటుగా వాయిస్ ను వినిపించ‌డం ద్వారా 2019 ఎన్నిక‌ల్లో అధికారంలోకి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రాగ‌లిగారు. ప్ర‌జాకోర్టులో వ‌చ్చిన తీర్పు ఇప్పుడు న్యాయ‌స్థానాల కంటే ప‌వ‌ర్ ఫుల్ గా (YCP Criminal status) క‌నిపిస్తోంది. అందుకే, ప‌లు కేసుల విచార‌ణ‌కు ప్ర‌తి శుక్ర‌వారం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కోర్టుల హాజ‌రు నుంచి త‌ప్పించుకున్నారు. ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న‌ప్పుడు కోర్టు కేసుల‌కు హాజ‌ర‌య్యే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సీఎం అయిన త‌రువాత ప్ర‌జలు ఇచ్చిన తీర్పును న్యాయ‌బ‌ద్ధంగా వాడుకుంటున్నారు. ఫ‌లితంగా ఆయ‌న మీద ఉన్న కేసులు ఇప్ప‌ట్లో తేల‌డానికి అవ‌కాశం లేదు. అప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న్ను ముద్దాయి లేదా నేర‌స్తుడు అన‌డానికి చ‌ట్టం అంగీక‌రించ‌దు.

Also Read : Jagan Delhi : ఢిల్లీ అపాయిట్మెంట్ నో, తాడేప‌ల్లి వైపు సీబీఐ?

ప్ర‌జాకోర్టు, న్యాయ స్థానాలు ఇచ్చిన తీర్పు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వైపు ఉన్న‌ప్ప‌టికీ మాజీ సీఎం చంద్ర‌బాబునాయుడు మాత్రం వ‌ద‌ల‌డంలేదు. ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మీద ఉన్న కేసుల (YCP Criminal status)గురించి ప్ర‌జ‌ల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు గుర్తు చేస్తున్నారు. ఆర్థిక నేర‌స్తుడు సీఎంగా ఉండ‌డానికి లేద‌ని ప్ర‌తి వేదిక‌పైనా చెబుతున్నారు. రాష్ట్రానికి ఆయ‌న వ‌ల‌న క‌లిగిన న‌ష్టాన్ని పూస‌గుచ్చిన‌ట్టు చెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఆయ‌న చెప్పే మాట‌ల‌ను ఆల‌కించ‌డానికి ఇటీవ‌ల పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు ఎగ‌బ‌డుతున్నారు. ఒక వైపు ప్ర‌జాక్షేత్రం ఇంకో వైపు సోష‌ల్ మీడియా వేదిక‌గా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మీద ఉన్న క్విడ్ ప్రో కో కేసుల గురించి చెబుతున్నారు. తాజాగా వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (Jaganmohan Reddy)మీద ఉన్న క్రిమిన‌ల్ కేసుల జాబితాను బుధ‌వారం ట్వీట్ చేశారు. దీంతో ఆ కేసులు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

Also Read : Rayudu political entry : అంబ‌టి రాయుడు YCP గుంటూరు గ్రౌండ్లోకి..?

మాజీ సీఎం చంద్ర‌బాబు చేసిన ట్వీట్ ప్ర‌కారం వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేల మీద 408 క్రిమిన‌ల్ కేసులు ఉన్నాయి. సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మీద 11 సీబీఐ కేసులు, తొమ్మిది ఈడీ కేసులు వెర‌సి 31 క్రిమిన‌ల్ కేసులు ఉన్నాయ‌ని ట్వీట్ చేశారు. అంతేకాదు, నేర ప్ర‌వృత్తి ఉన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సీఎం అయిన త‌రువాత న్యాయ‌స్థానాల్లో ప్ర‌భుత్వం చేస్తోన్న ఖ‌ర్చు 70శాతం పెరిగింద‌ని గుర్తు చేశారు. ఇదంతా కేవ‌లం మ‌చ్చుకు మాత్ర‌మే. ఇలాంటి క్రిమిన‌ల్స్ న్యాయమైన ప‌రిపాల‌న‌ ఎలా చేస్తారు? అంటూ ప్ర‌శ్నిస్తూ ట్వీట్ చేయ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఏపీ సీఎంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత కొన్ని వేల కోట్లు న్యాయ‌స్థానాల్లో వాదించ‌డానికి ఖ‌ర్చు పెట్టారు. మున్నెన్న‌డూ లేనివిధంగా ఐపీఎస్, ఐఏఎస్ లు సైతం న్యాయ‌స్థానాల‌లోచివాట్లు తిన‌డ‌మే కాదు, శిక్ష‌లు కూడా వేయించుకున్నారు. ఇలాంటి ప్ర‌భుత్వం నుంచి న్యాయం జ‌రుగుతుంద‌ని భావించ‌డం ఎలా అంటూ చంద్ర‌బాబు ప్ర‌శ్నిస్తున్నారు.