Ambati Rambabu : అంబటి రాంబాబు అల్లుడు కి వైసీపీ కౌంటర్

అంబటి రాంబాబు లాంటి నీచుడు, శవాలమీద పేలాలు ఏరుకునే రకం. సమాజం మీద బాధ్యతలేని వ్యక్తి. ఇలాంటి వ్యక్తికి ఓటు వేయొద్దు

Published By: HashtagU Telugu Desk
Ycp Gowtham

Ycp Gowtham

మరో వారం రోజుల్లో ఏపీలో ఎన్నికల పోలింగ్ జరగనున్న క్రమంలో మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) కు భారీ షాక్ ఇచ్చాడు ఆయన అల్లుడు. ఈసారి ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అంబటి రాంబాబుకు ఓటు వేయొద్దని సొంత అల్లుడు గౌతమ్ ఓటర్లకు సూచించారు. అంబటి రాంబాబు లాంటి నీచుడు, శవాలమీద పేలాలు ఏరుకునే రకం. సమాజం మీద బాధ్యతలేని వ్యక్తి. ఇలాంటి వ్యక్తికి ఓటు వేయొద్దు. ఓటు వేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఓటు వేయాలి అని ఓటర్లను కోరారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

We’re now on WhatsApp. Click to Join.

కాగా ఈ వీడియో ఫై వైసీపీ స్పందించింది. అంబటి రాంబాబు రెండో కుమార్తె భర్తే గౌతమ్‌‌ (Gowtham)…ఇద్దరు డాకర్లు కావడంతో కూతుర్ని మేనల్లుడుకి ఇచ్చి వివాహం చేశారాయన. అయితే గౌతమ్‌తో అంబటి రెండో కూతురి మధ్య నాలుగేళ్లుగా వివాదం నడుస్తోంది. భర్త అరాచకాలను భరించలేక పిల్లలతో కలిసి రాంబాబు కుమార్తె విడిగా ఉంటోంది. దీన్ని తట్టుకోలేకనే గౌతమ్ ఇలా అంబటిపై పగ తీర్చుకుంటున్నాడని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇలా వీడియో చేసి పెట్టడం..ఆయన దిగజారుడుకు నిదర్శనమని అంటున్నారు. మరి వీరు చెప్పేది ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం గౌతమ్ రిలీజ్ చేసిన వీడియో మాత్రం జనాల్లోకి కూటమి నేతలు తీసుకెళ్తున్నారు.

Read Also : Telangana : రోజుకు 20 లక్షల బీర్లు..అయినా సరిపోవడం లేదని గగ్గోలు..

  Last Updated: 05 May 2024, 05:05 PM IST