Site icon HashtagU Telugu

YCP : ఏపీని బీహార్ తో పోల్చిన వైసీపీ

Ycp Ap Bihar

Ycp Ap Bihar

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొన్ని నెలలకే రాష్ట్ర పరిస్థితి బీహార్ తరహాలో మారిపోయిందని వైసీపీ (YCP) మండిపడింది. ప్రజల ధనం, గౌరవం, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపిస్తూ, చట్టవ్యవస్థ కూలిపోతోందని విమర్శించింది. ముఖ్యంగా పరిశ్రమల అభివృద్ధి, పెట్టుబడుల రక్షణ వంటి కీలక రంగాల్లో పాలన విఫలమైందని పార్టీ ఆరోపిస్తోంది.

Super Star Rajanikanth : రజినీ సింప్లిసిటీ.. రోడ్డు పక్కన నిల్చొని భోజనం!

వైసీపీ ఆరోపణల ప్రకారం..ప్రస్తుత పాలనలో కొంతమంది ఎమ్మెల్యేలు రౌడీల్లా ప్రవర్తిస్తూ పారిశ్రామికవేత్తలకు హుకుం జారీ చేస్తున్నారని, వాటాలు ఇవ్వకపోతే కంపెనీలు నడవనీయని పరిస్థితి ఏర్పడిందని తెలిపింది. ఫలితంగా వ్యాపార వాతావరణం దెబ్బతింటోందని, చిన్నతరహా నుండి పెద్దతరహా పరిశ్రమల వరకు భయంతో పనిచేయలేని స్థితి వస్తోందని వైసీపీ నేతలు పేర్కొన్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన NRIలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని వైసీపీ చెబుతోంది. రాష్ట్రం పెట్టుబడులకు సురక్షితం కాదని వాణిజ్య వర్గాల్లో చర్చనీయాంశమవుతోందని పేర్కొంటోంది. పారిశ్రామిక వాతావరణం కాపాడాలంటే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉందని వైసీపీ హితవు పలుకుతోంది. ఈ విమర్శలతో రాష్ట్ర పాలనపై కొత్త చర్చ మొదలైంది.

Exit mobile version