Site icon HashtagU Telugu

Kadapa : జగన్ సొంత జిల్లాలో వైసీపీ క్లోజ్ ..?

Jagan Marks Justice

Jagan Marks Justice

కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం(Mydukur Assembly Constituency)లో వైసీపీ (YCP) తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 2024 సాధారణ ఎన్నికల అనంతరం కూటమి పార్టీ అధికారం చేపట్టడంతో దీర్ఘకాలంగా వైసీపీ హస్తగతంలో ఉన్న మైదుకూరు నియోజకవర్గం చేజారిపోయింది. 1999 తర్వాత తొలిసారిగా టీడీపీ అభ్యర్థి విజయం సాధించడం వల్ల వైసీపీ క్యాడర్ తీవ్ర నిరాశలో పడిపోయింది. ముఖ్యంగా వైసీపీకి విశ్వాసంగా ఉన్న కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి (Settipalli Raghurami Reddy) నిర్లక్ష్య వైఖరిపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మైదుకూరులో 1985 నుంచి వరుసగా తొమ్మిది సార్లు పోటీ చేసిన రఘురామిరెడ్డి, నాలుగు సార్లు మాత్రమే విజయం సాధించగా, 2024 ఎన్నికల్లో ఓటమి చెందిన అనంతరం పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఎన్నికల తర్వాత ఆయన నియోజకవర్గాన్ని పూర్తిగా విస్మరించడంతో, క్యాడర్ తీవ్ర నిరాశలో మునిగిపోయింది. ఎన్నికల ముందు కార్యకర్తలతో అనేక హామీలు ఇచ్చినా, ఓటమి తర్వాత వారిని పట్టించుకోవడం లేదని వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Ayodhya Ram Mandir: షిర్డీ, వైష్ణోదేవి ఆలయాలను దాటేసిన అయోధ్య రామమందిరం
అధికారంలో ఉన్న సమయంలో తన అనుచరులకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి, సాధారణ కార్యకర్తలను దూరంగా ఉంచిన మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు అసలు కనపడకపోవడం క్యాడర్‌ను తీవ్ర నిరుత్సాహానికి గురి చేసింది. జగన్ క్యాడర్‌కు భరోసా ఇచ్చేలా, రెండోసారి అధికారంలోకి వస్తే, పార్టీ శ్రేణులకు ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇస్తున్నప్పటికీ. ఆయన సొంత జిల్లాలోనే క్యాడర్ సమస్యలు ఎదుర్కొంటున్నా, పార్టీ నాయకత్వం పట్టించుకోవడం లేదు. మైదుకూరు నియోజకవర్గం కాకుండా, కడప జిల్లాలోనే వైసీపీ ఓటమి చెందిన ఇతర నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి. వైసీపీ కార్యకర్తల్లో అసంతృప్తి పెరుగుతుండడంతో, టీడీపీ నాయకత్వం గట్టిపట్టు సాధిస్తోంది. టీడీపీ విజయం సాధించిన మైదుకూరులో పుట్టా సుధాకర్ యాదవ్ ఇప్పటికే పార్టీని బలోపేతం చేసే చర్యలు చేపట్టారు. వైసీపీ కార్యకర్తలు కొంతమంది టీడీపీ వైపు చూస్తున్నా, టీడీపీ నేతలు వారిని వెంటనే పార్టీలో చేర్చుకోవడానికి సుముఖంగా లేరు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ క్యాడర్ టీడీపీ కార్యకర్తలపై అనేక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. త్వరలోనే వారు కూడా శాంతిస్తారని భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికి జగన్ సొంత జిల్లాలో వైసీపీ క్లోజ్ కాబోతుందనే సంకేతాలు బలంగా వినిపిస్తుండడం తో మిగతా జిల్లాలోని శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.