YCP-CBN : జ‌గ‌న్ `స్వ‌ర‌`ల‌హ‌రి, టీడీపీ బ‌హుప‌రాక్‌!

చంద్ర‌బాబు వ్యూహానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(YCP-CBN) ఖంగుతిన్నారా? టీడీపీని దెబ్బ‌తీసే ప్ర‌య‌త్నం

  • Written By:
  • Publish Date - March 27, 2023 / 01:36 PM IST

చంద్ర‌బాబు వ్యూహానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(YCP-CBN) ఖంగుతిన్నారా? వ్యూహాత్మ‌కంగా టీడీపీని దెబ్బ‌తీసే ప్ర‌య‌త్నం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan) చేస్తున్నారా? అంటే తాజాగా రాజ‌కీయ ప‌రిణామాలు అనుకూలంగా ఉన్నాయ‌ని టీడీపీ భావిస్తోంది. అయితే, ఆ పార్టీ అత్యుత్సాహం కంటే రాబోవు ఎన్నిక‌ల్లో జ‌రిగే న‌ష్టం దిశ‌గా ప‌రిణామాలు ఉన్నాయ‌ని గ్ర‌హించ‌లేక‌పోతోంది. ఎందుకంటే, ప్ర‌స్తుతం వైసీపీలో 40 మందికి టిక్కెట్లు లేవ‌ని ఆ పార్టీ తేల్చేసింది. ప్ర‌త్యేకించి కొంద‌రికి మొఖం మీదే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చెప్పేశార‌ని అంద‌రికీ తెలిసిందే. ఆ జాబితాలో తాజా వైసీపీ రెబ‌ల్స్ న‌లుగురు ఉన్నారు. అంతేకాదు, మ‌రో 40 మంది టీడీపీకి ట‌చ్ లో ఉన్నార‌ని మాజీ మంత్రి చిన‌రాజ‌ప్ప చెబుతోన్న మాట‌. అంటే వాళ్లంద‌రూ టీడీపీలోకి వ‌స్తార‌ని ప‌రోక్షంగా సంకేతాలు ఇచ్చారు. స‌రిగ్గా ఇక్క‌డే రాజ‌కీయ ట్విస్ట్ నెల‌కొంది.

చంద్ర‌బాబు వ్యూహానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి  ఖంగు (YCP-CBN)

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఫ‌క్తు రాజ‌కీయ నేత‌. ఎప్పుడూ క్షేత్ర‌స్థాయి స‌ర్వేల‌ను బేరీజు వేసుంటారు. అందుకే, తొలుత 70 మందిని తొల‌గించాల‌ని భావించారు. ఆ త‌రువాత కొంత గ‌డువు ఇస్తూ అప్ టూ మార్క్ గ్రాఫ్ లేక‌పోతే టిక్కెట్లు ఇవ్వ‌లేన‌ని రివ్యూ మీటింగ్ ల్లో చెప్పారు. దీంతో ప్ర‌త్యామ్నాయంగా టీడీపీ పంచ‌న చేర‌డానికి చాలా మంది ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఫ‌లితంగా గ‌త నాలుగేళ్లుగా సైనికుల్లా క్షేత్ర‌స్థాయిలో ప‌నిచేసిన నియోజ‌క‌వ‌ర్గాల టీడీపీ ఇంచార్జిల‌కు అభ‌ద్ర‌తాభావం ఏర్ప‌డింది. ఒక వేళ వైసీపీ నుంచి రెబ‌ల్స్ గా (YCP-CBN)ఉండే వాళ్లు టీడీపీ పంచ‌న చేరితే, రాబోవు రోజుల్లో చంద్ర‌బాబు టిక్కెట్ ఇస్తారా? లేదా? అనే సందేహం ఏర్ప‌డింది. ఫ‌లితంగా ప్ర‌స్తుతం ఇంచార్జిలుగా ఉన్న టీడీపీ నేత‌లు ఉత్సాహంగా ముందుకు రాలేక‌పోతున్నార‌ని తెలుస్తోంది. ఇలాంటి పరిణామ‌మే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి కూడా కావాల్సింది.

మంత్రివ‌ర్గంలో మార్పులు ఉంటాయ‌ని సంకేతాలు

వాస్త‌వంగా ప‌ట్ట‌భ‌ద్రుల ఎన్నిక‌ల‌ను పూర్తిగా మంత్రుల మీద జగ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan) పెట్టేశారు. అంద‌ర్నీ గెలిపించుకుని రావాల‌ని, మీ ప‌నితీరును గ‌మ‌నిస్తున్నాన‌ని ఆ ఎన్నిక‌ల‌కు ముందే హెచ్చరించారు. అంతేకాదు, మంత్రివ‌ర్గంలో మార్పులు కూడా ఉంటాయ‌ని సంకేతాలు ఇచ్చారు. అంటే, పూర్తిగా మీ స‌త్తా ఏమిటో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో చూపాల‌ని, దాన్ని బ‌ట్టి మీ భ‌విష్య‌తును తేల్చుతానంటూ ప‌రోక్షంగా సంకేతాలు ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత‌ ఎవ‌రెవ‌ర్ని తొల‌గించాలి? అనే దానిపై జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి స్ప‌ష్ట‌త వ‌చ్చింది. త్వ‌ర‌లోనే మంత్రివ‌ర్గంలోని 10 మంది మంత్రులు మారబోతున్నార‌ని స‌మాచారం. ఇక‌, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఘ‌ట్టాన్ని పార్టీలోని సీనియ‌ర్ల‌కు అప్ప‌గించారు. మొత్తం ఏడు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు సంబంధించి ఏడుగురు సీనియ‌ర్ల‌కు గెలుపు బాధ్య‌త‌ను అప్ప‌గించారు. త‌న ప్ర‌మేయం లేకుండా ఎంత వ‌ర‌కు మేనేజ్ చేయ‌గ‌ల‌రు? అనేది చూశారు. ఎవ‌రైనా ప్ర‌తిపాద‌న‌ల‌ను తీసుకొస్తే, వాటి మీద స్ప‌ష్టంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అభిప్రాయాన్ని చెప్పారు. దీంతో ఎన్నిక‌ల ప్ర‌క్రియను సీనియ‌ర్ల భుజం మీద‌కు నెట్టారు.

Also Read : CBN Target:తెలంగాణ ఎన్నిక‌లకు`నాంప‌ల్లి గ్రౌండ్స్`లో మ‌లుపు

ప‌ట్ట‌భద్రులు, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక ఘ‌ట్టాల (YCP-CBN)త‌రువాత మంత్రులు, సీనియ‌ర్ల స‌త్తా ఏమిటో తెలిసి పోయింది. ఇక భారీ ప్ర‌క్షాళ‌న పార్టీలో మొద‌లు పెట్ట‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (Jagan)సిద్ద‌మ‌య్యార‌ని తెలుస్తోంది. అందుకే, రాజ‌కీయ‌వేడిని త‌గ్గించ‌డానికి దెందులూరు స‌భ‌లో వ్యూహాత్మ‌కంగా ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను గురించి మాత్ర‌మే ప్ర‌స్తావించారు. ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను సైతం ఏమీ కామెంట్ చేయ‌కుండా చేసిన ప‌నుల‌ను చెప్పుకుని వెళ్లారు. ఇలాంటి మీటింగ్ లు మాత్ర‌మే ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కూడా ఈ వారం ఉంటాయ‌ని తెలుస్తోంది. ఆ త‌రువాత పార్టీలోనూ, మంత్రివ‌ర్గంలోనూ భారీ ప్ర‌క్షాళ‌న‌ల‌ను చేసిన త‌రువాత ఎన్నిక‌ల‌కు దిశానిర్దేశం ఇవ్వ‌నున్నార‌ని తెలుస్తోంది. సంస్థాగ‌త లోపాల‌ను స‌రిదిద్దుకోవ‌డానికి, స‌ర్వేల్లో వెనుక‌బ‌డిన వాళ్ల‌ను త‌ప్పించ‌డానికి సానుకూల ప‌రిణామాల‌ను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ్యూహాత్మ కంగా ఉప‌యోగించుకోబోతున్నార‌ని తాడేప‌ల్లి వ‌ర్గాల్లోని టాక్‌.

జ‌న‌సేన రూపంలో 30 చోట్ల‌ ,40 చోట్ల వైసీపీ రెబ‌ల్స్ రూపంలో..

ఇక గ‌త నాలుగేళ్లుగా బ‌ల‌ప‌డుతూ వ‌స్తోన్న టీడీపీ అనూహ్యంగా మూడు ప‌ట్ట‌భ‌ద్రులు, ఒక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ప‌ద‌విని పొందింది. ఇదంతా చంద్ర‌బాబు చేసిన రాజ‌కీయ చ‌తుర‌త‌. ప‌బ్లిక్ వేవ్ కూడా టీడీపీ వైపు ఉంద‌ని ప‌ట్ట‌భ‌ద్రుల ఫ‌లితాలు చెబుతున్నాయి. స‌రిగ్గా ఇక్క‌డే టీడీపీ సంస్థాగ‌త పునాదుల‌ను(YCP-CBN) క‌దిలించ‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సైలెంట్ గా పావులు క‌దుపుతున్నారు. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు 40 మందిని వ‌దిలించుకోవ‌డానికి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తోన్న స‌మ‌యంలో వాళ్ల‌ను టీడీపీ లాగేసుకునే ప్ర‌య‌త్నంలో ఉంది. ఆ 40 స్థానాల్లో సంస్థాగ‌తంగా టీడీపీ గంద‌ర‌గోళంలోకి వెళ్లే ప్ర‌మాదం ఉంది. మ‌రో వైపు జ‌న‌సేన పొత్తు అంటూ ఇప్ప‌టికే 30 స్థానాల్లో గంద‌ర‌గోళ ప‌రిస్థితి ఉంది. ఆయా నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జిలు న‌మ్మ‌కంగా ప‌నిచేసే ప‌రిస్థితి లేదు. టిక్కెట్ హామీ లేకుండా డ‌బ్బు ఖ‌ర్చు పెట్టుకుని ఎవ‌రూ నిల‌బడి ప‌నిచేసే ప‌రిస్థితి ఉండ‌దు. ఈ ప‌రిణామం ఇప్ప‌టికే జ‌న‌సేన రూపంలో 30 చోట్ల‌ ఉండ‌గా, తాజాగా మ‌రో 40 చోట్ల వైసీపీ రెబ‌ల్స్ రూపంలో నెల‌కొంది. అంటే , వ్యూహాత్మ‌కంగా టీడీపీని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan) కార్న‌ర్ చేసి సైలెంట్ అయ్యారా? నిజంగా చంద్ర‌బాబు వేసిన వ్యూహంతో వైసీపీ ప‌నైపోయిందా? అనేది మీరే తేల్చాలి.

Also Read : TDP MLC : గెలుపు`వ‌సంతం`,చంద్ర‌బాబు చాణ‌క్యంలో..!