YCP Candidate List 2024 : అభ్యర్థుల ప్రకటనకు ముహూర్తం ఫిక్స్ చేసిన జగన్ ..?

175 కు 175 విజయం సాదించాల్సిందే అని పట్టుదలతో ఉన్న వైసీపీ అధినేత, సీఎం జగన్ (Jagan)..ఆ మేరకు వ్యూహాలు రచిస్తూ వస్తున్నారు. నియోజకవర్గంలో ప్రజల మద్దతు లేని నేతలకు పక్కకు పెట్టడం..లేదా నియోజకవర్గాలను మార్చడం వంటివి చేస్తూ వచ్చారు. ఇప్పటికే 12 జాబితాల్లో నియోజకవర్గాల ఇంచార్జ్ లను ప్రకటించారు. దాదాపు వీరే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులని తెలుస్తున్న..బీఫామ్ చేతికి వచ్చేవరకు అసలు అభ్యర్థి ఎవరా అనేది తెలియని పరిస్థితి. We’re now on WhatsApp. […]

Published By: HashtagU Telugu Desk
Ycp Candidate List Announce

Ycp Candidate List Announce

175 కు 175 విజయం సాదించాల్సిందే అని పట్టుదలతో ఉన్న వైసీపీ అధినేత, సీఎం జగన్ (Jagan)..ఆ మేరకు వ్యూహాలు రచిస్తూ వస్తున్నారు. నియోజకవర్గంలో ప్రజల మద్దతు లేని నేతలకు పక్కకు పెట్టడం..లేదా నియోజకవర్గాలను మార్చడం వంటివి చేస్తూ వచ్చారు. ఇప్పటికే 12 జాబితాల్లో నియోజకవర్గాల ఇంచార్జ్ లను ప్రకటించారు. దాదాపు వీరే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులని తెలుస్తున్న..బీఫామ్ చేతికి వచ్చేవరకు అసలు అభ్యర్థి ఎవరా అనేది తెలియని పరిస్థితి.

We’re now on WhatsApp. Click to Join.

ఈ నేపథ్యంలో ఫైనల్ లిస్ట్ (YCP Candidate List 2024) సిద్ధం చేసిన జగన్.. అభ్యర్థుల జాబితా ప్రకటనకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం. 2019 లో ఏ డేట్ & వేదిక ను చేసుకొని అభ్యర్థులను ప్రకటించారో..ఇప్పుడు కూడా అదే డేట్ & వేదిక ను ఫిక్స్ చేసారు. మార్చి 16వ తేదీన వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయ వేదికగా జగన్ తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించబోతున్నారట. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను జగన్ ప్రకటిచనున్నారని పార్టీ వర్గాలు చెపుతున్నారు. 2019 శాసనసభ ఎన్నికల సమయంలోనూ ఇడుపులపాయ నుంచే వైఎస్ జగన్ అభ్యర్థుల జాబితా విడుదల చేశారు. ఈ సారి కూడా అదే సెంటిమెంట్ ఫాలోకానున్నారు. దీంతో జగనన్న సెంటిమెంట్ వర్క్ అవుట్ అయితే మరోసారి వైసీపీ అధికారంలోకి రావటం ఖాయమని పార్టీ శ్రేణులు సంబరపడుతున్నారు. చూద్దాం ఏంజరుగుతుందో..

Read Also : Nayab Singh Saini: విశ్వాస పరీక్షలో విజయం సాధించిన హ‌ర్యానా నూతన సీఎం

  Last Updated: 13 Mar 2024, 03:46 PM IST