Jagan : రేపటి నుండి అసలు సినిమా చూపిస్తా అంటున్న జగన్..

ఇప్పటి వరకు జస్ట్ ట్రయిలర్ (Trailer ) చూసారు..రేపటి నుండి అసలు సినిమా (Cinema) చూపిస్తాం అంటూ ప్రతిపక్ష పార్టీలకు సీఎం జగన్ (CM Jagan) హెచ్చరిక జారీ చేసారు. 175 కు 175 గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న జగన్..ఎక్కడ..ఏ విషయంలో..ఎవరి దగ్గర తగ్గడం లేదు. ఎంత దగ్గరి వ్యక్తి అయినా సరే..ప్రజలు వద్దు అంటే వద్దనే అంటున్నారు. ఇప్పటీకే నియోజకవర్గాల్లో పలు సర్వేలు చేయించిన జగన్..ఎవరికైతే ప్రజలు జై కొడుతున్నారో..వారికే టికెట్ అని ముందు నుండి […]

Published By: HashtagU Telugu Desk
Cm Jagan (2)

Cm Jagan (2)

ఇప్పటి వరకు జస్ట్ ట్రయిలర్ (Trailer ) చూసారు..రేపటి నుండి అసలు సినిమా (Cinema) చూపిస్తాం అంటూ ప్రతిపక్ష పార్టీలకు సీఎం జగన్ (CM Jagan) హెచ్చరిక జారీ చేసారు. 175 కు 175 గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న జగన్..ఎక్కడ..ఏ విషయంలో..ఎవరి దగ్గర తగ్గడం లేదు. ఎంత దగ్గరి వ్యక్తి అయినా సరే..ప్రజలు వద్దు అంటే వద్దనే అంటున్నారు. ఇప్పటీకే నియోజకవర్గాల్లో పలు సర్వేలు చేయించిన జగన్..ఎవరికైతే ప్రజలు జై కొడుతున్నారో..వారికే టికెట్ అని ముందు నుండి చెపుతూ వచ్చిన జగన్..ఇప్పుడు అలాగే టికెట్స్ కేటాయిస్తున్నారు. దాదాపు 12 జాబితాలను రిలీజ్ చేసిన జగన్..ఇక రేపు మొత్తం 175 స్థానాలకు, లోక్‌సభ 25 స్థానాలకు ఒకేసారి అభ్యర్థుల్ని ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు.

We’re now on WhatsApp. Click to Join.

వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ నుంచి పార్టీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్ అభ్యర్థుల ప్రకటన (YCP Candidate 2024 Announcement) చేయబోతున్నారు. గత ఎన్నికల సమయంలోనూ ఇలాగే ప్రకటించి భారీ విజయం సాధించారు. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారు. ఇప్పటికే 70కి పైగా అసెంబ్లీ, 20కి పైగా పార్లమెంట్‌ స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసారు. మిగతా స్థానాల్లో కొన్నింట్లో సిట్టింగ్‌లకే అవకాశం కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారీగా మార్పులు లేకుండా ఇప్పటికే పూర్తిస్థాయి జాబితా సిద్ధమైనట్లు సమాచారం. రేపు అధికారిక ప్రకటన వెలువడుతుండడంతో ఇటు వైఎస్సార్‌సీపీ శ్రేణులు.. అటు రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇదిలా ఉండగా రేపు ఈసీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటన చేయబోతుంది. షెడ్యూల్ విడుదలైతే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లే. షెడ్యూల్ విడుదల అయ్యాక వైసీపీ నేతలంతా పూర్తి స్థాయిలో ప్రచారంలోకి దిగబోతున్నారు. ఇప్పటికే చాలామంది ప్రచారం మొదలుపెట్టి ఓటర్లకు దగ్గర అవుతూ వస్తున్నారు. రేపటి నుండి ప్రతిపక్ష పార్టీలకు అసలు సినిమా చూపించేందుకు సిద్ధం అవుతున్నారు. మరి ప్రజలు ఏంచేస్తారో చూడాలి.

Read Also : YS Sunitha Reddy : హంతకుల పక్షాన ఉంటారా ? బాధితుల పక్షాన ఉంటారా ? : వైఎస్ సునీతారెడ్డి

  Last Updated: 15 Mar 2024, 03:48 PM IST