YCP Blame TDP : పెన్షన్ పేరుతో వైసీపీ నీచ రాజకీయం..

వాలంటీర్లు స్థానిక రాజకీయ నాయకులతో కలిసి లేవలేని వృద్దులను, వికలాంగులను కార్లు, ఆటోల్లో గ్రామ సచివాలయాలకు తరలించి ముందస్తుగా సిద్ధం చేసిన మంచాలపై వారిని మోసుకెళ్తునటువంటి వీడియోలను చిత్రీకరించి

  • Written By:
  • Publish Date - April 3, 2024 / 11:36 PM IST

ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని , మరోసారి సీఎం కుర్చీలో కూర్చోవాలనే ఆశతో వైసీపీ అధినేత , సీఎం జగన్ నీచ రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తుంది. శవ రాజకీయాలే కాదు ఆఖరికి పెన్షన్ దారుల ఇబ్బందులను కూడా తన రాజకీయాలకు మల్చుకుంటున్నారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో గ్రామ వాలంటీర్లను పింఛన్ల పంపిణీ బాధ్యతల నుంచి ఈసీ తప్పించింది. దీంతో పెన్షన్ దారులకు పెన్షలను ప్రభుత్వ అధికారులను ఇవ్వాలని సూచించింది. అయితే అధికారులను నేరుగా ఇంటికే వెళ్లి ఇవ్వాలని ప్రతిపక్ష పార్టీలు సూచించాయి. అయినాగానీ ప్రభుత్వం మాత్రం సచివాలయం వద్ద ఇస్తూ వచ్చింది. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో మంచానికి, వీల్‌ఛైర్‌కు పరిమితమైనవారు, సైనిక సంక్షేమ పింఛన్లు పొందే వృద్ధ వితంతువులకు మాత్రమే ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు అందజేయాలని ఉత్తర్వులో పేర్కొన్నప్పటికీ..ప్రభుత్వం మాత్రం ఆలా ఇవ్వకుండా కావాలని వారిని పంచాయితీ కార్యాలయం వద్దకు తీసుకొచ్చి టిడిపి ఫై విష ప్రచారం చేస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఓట్ల కోసం వైసీపీ మానవత్వం లేకుండా ప్రవర్తిస్తుందని , వాలంటీర్లు స్థానిక రాజకీయ నాయకులతో కలిసి లేవలేని వృద్దులను, వికలాంగులను కార్లు, ఆటోల్లో గ్రామ సచివాలయాలకు తరలించి ముందస్తుగా సిద్ధం చేసిన మంచాలపై వారిని మోసుకెళ్తునటువంటి వీడియోలను చిత్రీకరించి వాటిని సోషల్ మీడియాలో పెట్టి టీడీపీపై విషప్రచారం చేస్తున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ వాళ్లు వాలంటీర్లను ఇళ్లకు రానీయకుండా అడ్డుకోవడం వల్లే ఇలా పెన్షనర్లు నానా కష్టాలు పడుతున్నారన్నట్టుగా ప్రచారం చేస్తూ ఓట్లు రాబట్టుకోవాలని చూస్తుంది. అసలు పెన్షన్లు మేమే ఇంటికి తెచ్చి ఇస్తామని చెబుతుంటే మీరందరూ ఎండలో ఇక్కడి దాకా ఎందుకు వచ్చారని అధికారులు పెన్షనర్లను ప్రశ్నిస్తున్నారు. ఇక వైసీపీ (YCP) నేతల చేస్తున్న దీనిపై ఈసీకి పిర్యాదు చేయాలనీ టీడీపీ చూస్తుంది. సోషల్ మీడియా లో తమపై విష ప్రచారం చేసేందుకు వైసీపీ నేతలు అరేంజ్డ్ వీడియోలు తీస్తున్నారని ఈసీ దృష్టికి టిడిపి తీసుకెళ్లబోతుంది.

Read Also : Chandrababu : నేను శివుడి అవతారం – చంద్రబాబు