Site icon HashtagU Telugu

YCP- BJP : బంధానికి గండి! జ‌గ‌న్ స‌ర్కార్ కు మూడిన‌ట్టే?

Ycp Bjp

Ycp Bjp

వైసీపీ, బీజేపీ (YCP-BJP)మ‌ధ్య రాజ‌కీయ అవగాహ‌న ఉందని రాజ‌కీయాల గురించి బాగా తెలిసిన వాళ్లు చెప్పే మాట‌. అందుకే, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan mohan Reddy) బెయిల్ మీద ప‌రిపాల‌న సాగిస్తున్నార‌ని టీడీపీ ప‌దేప‌దే చెబుతోంది. ఆయ‌న ఆస్తులు, వివేకా మ‌ర్డ‌ర్, కోడిక‌త్తి త‌దిత‌ర కేసుల విచార‌ణ ముందుకు సాగ‌డంలేదు. ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ లో ఈడీ నుంచి నోటీసులు అందుకున్న‌ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి సేఫ్ గా బ‌య‌ట‌ప‌డ్డారు. ఇవ‌న్నీ గ‌మ‌నిస్తోన్న వాళ్లు ఢిల్లీ బీజేపీ పెద్ద‌ల‌తో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బంధం చాలా గ‌ట్టిగా ఉంద‌ని చెబుతుంటారు. కానీ, ఏపీ బీజేపీ ఇంచార్జి సునీల్ దేవ‌ధ‌ర్ మాత్రం వివేకా మ‌ర్డ‌ర్ కేసు విచార‌ణ‌లో సీబీఐ దూకుడును ప్ర‌స్తావించారు. దాన్ని చూసిన త‌రువాత కూడా వైసీపీతో బీజేపీకి బంధం ఉంద‌ని ఎలా అనుకుంటారు? అంటూ గురువారం మీడియా వ‌ద్ద వెలుబుచ్చారు.

వైసీపీ, బీజేపీ మ‌ధ్య రాజ‌కీయ అవగాహ‌న(YCP-BJP)

మాజీ మంత్రి వివేకా హ‌త్య కేసు విచార‌ణ వేగ‌వంతం అయింది. దానికి కార‌ణం సుప్రీం కోర్టు ఆర్డ‌ర్స్ అనే విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఈనెలాఖ‌రు నాటికి విచార‌ణ పూర్తి చేయాల‌ని సీబీఐకి డెడ్ లైన్ పెట్టింది. నాలుగేళ్లుగా ఆ కేసును విచారిస్తోన్న సీబీఐ మీద ఇటీవ‌ల మండిప‌డింది. అప్ప‌టి వ‌ర‌కు విచార‌ణాధికారిగా ఉన్న రామ్ సింగ్ మార్చేసింది. ఆయ‌న స్థానంలో ఉన్న‌తాధికారుల గ్రూప్ ను విచార‌ణ కోసం నియ‌మించింది. వెంట‌నే రంగంలోకి దిగిన టీమ్ అనూహ్యంగా భాస్క‌ర్ రెడ్డిని అరెస్ట్ చేసింది. దీంతో క‌ల‌వ‌ర‌ప‌డిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (Jagan mohan Reddy) కోట‌రీ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ ను అపుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఆ క్ర‌మంలో హైకోర్టులో ముందుస్తు బెయిల్ కోసం పిటిష‌న్ వేసింది. నేష‌న‌ల్ లాబీయిస్ట్ విజ‌య‌కుమార్ అనే జ్యోతిష్య‌, ఆధ్యాత్మిక వేత్త‌ను కూడా రంగంలోకి దింపింద‌ని వినికిడి. అంతేకాదు, ఇవేమీ ప‌నిచేయ‌క‌పోతే, ఢిల్లీకి వెళ్ల‌డానికి జ‌గ‌న్మోహన్ రెడ్డి సిద్ద‌మ‌వుతున్నారు. ఇదంతా తెలిసి కూడా సునీల్ దేవ‌ధ‌ర్ మాత్రం సీబీఐ దూకుడును చూసిన త‌రువాత వైసీపీతో బీజేపీకి (YCP-BJP)సంబంధాలు ఉన్నాయ‌ని ఎలా అంటార‌ని ప్ర‌శ్నించ‌డం గ‌మ‌నార్హం.

వివేకా మ‌ర్డ‌ర్ కేసు విచార‌ణ‌లో సీబీఐ దూకుడుపై సునీల్ దేవ‌ధ‌ర్ (YCP-BJP)

ప్ర‌భుత్వం ఏర్ప‌డిన కొత్త‌ల్లోనే కేంద్రానికి తెలియ‌కుండా ఏమీ చేయ‌లేమ‌ని ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి చెప్పారు. బ‌ల‌మైన నాయ‌కులుగా మోడీ, అమిత్ షాను ప్ర‌మాణ స్వీకారం సంద‌ర్భంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌స్తావించారు. అందుకే, ప్ర‌త్యేక హోదా దేవుడి ద‌య అంటూ అప్పుడే చెప్పారు. ఆ త‌రువాత ప్ర‌తి విష‌యంలోనూ బీజేపీకి మ‌ద్ధ‌తుగా వైసీపీ(YCP-BJP) నిలుస్తోంది. ఒకానొక స‌మ‌యంలో ఎన్డీయేలో భాగ‌స్వామిగా మారుతుంద‌ని కూడా ప్ర‌చారం జ‌రిగింది. రాజ‌కీయాల‌కు అతీత‌మైన బంధం మోడీతో ఉంద‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (Jagan mohan Reddy) ఇటీవ‌ల బ‌హిరంగ వేదిక‌పై ప్ర‌క‌టించారు. మాజీ మంత్రి వివేకా హ‌త్య కేసు విచార‌ణ వేగవంత‌మైన ప్రతిసారీ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఢిల్లీ వెళ‌తార‌ని అంద‌రికీ తెలిసిందే.

బీజేపీ ఢిల్లీ పెద్ద‌లు  స‌హ‌కారం అందించ‌డానికి సిద్దంగా లేరా? (Jagan mohan Reddy)

ఏపీ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శిస్తూ దుకుడుగా వెళ్లే ప‌వ‌న్ క‌ల్యాణ్ ను కూడా బీజేపీ ఢిల్లీ పెద్ద‌లు క‌ట్ట‌డీ చేశార‌ని టాక్‌. ప్ర‌ధాని మోడీ విశాఖ‌ప‌ట్నం వ‌చ్చిన సంద‌ర్భంగా జ‌నసేనానికి ఇచ్చిన దిశానిర్దేశం కార‌ణంగా ఆయ‌న స్లో అయ్యార‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లోని చ‌ర్చ‌. తెలుగుదేశం, జ‌న‌సేన క‌ల‌వ‌కుండా బీజేపీ రాజ‌కీయ గేమాడుతుంద‌ని కూడా స‌ర్వ‌త్రా వినిపిస్తోన్న మాట‌. అటు రాజ‌కీయంగా ఇటు ప‌రిపాల‌న ప‌రంగా మాత్ర‌మే కాకుండా వ్య‌క్తిగ‌తంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి(Jgan mohan Reddy) అన్ని ర‌కాలుగా కేంద్రంలోని బీజేపీ పెద్ద‌ల ఆశీస్సులు ఉన్నాయ‌ని ఏపీలోని జ‌నానికి తెలుసు. వాళ్ల అభిప్రాయాన్ని మార్చ‌డానికి సునీల్ దేవ‌ధ‌ర్ ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అందుకు వివేకా హ‌త్య కేసులో సీబీఐ దూకుడును అస్త్రంగా ప్ర‌యోగిస్తున్నారు. అంటే, బీజేపీ ఢిల్లీ పెద్ద‌లు ఈ కేసు విచార‌ణ ఆల‌స్యం అయ్యేలా జ‌గ‌న్ కు స‌హ‌కారం అందించ‌డానికి సిద్దంగా లేరా? అనే సందేహం క‌లుగుతోంది.

వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వానికి ఎంపి అవినాష్‌రెడ్డి అంశం మ‌రింత త‌ల‌నొప్పిగా

వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వానికి ఎంపి అవినాష్‌రెడ్డి అంశం మ‌రింత త‌ల‌నొప్పిగా మారింది. ముఖ్య‌మంత్రి కుటుంబ స‌భ్యుడు కావ‌డంతో ప్రజ‌ల్లో వ్య‌తిరేక‌త వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయని ఆందోళ‌న చెందుతోంది. ఇటువంటి కీల‌క స‌మ‌యంలో కుటుంబ స‌భ్యుల కంటే పార్టీ ప్ర‌తిష్ట ముఖ్య‌మ‌ని సీఎం జ‌గ‌న్ భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఆ విష‌యాన్ని చిత్తూరు జిల్లాకు చెందిన నేత‌లు ప్రైవేటు సంభాష‌ణ‌ల్లో చెబుతున్నారు. రాష్ట్ర డీజీపితో ముఖ్య‌మంత్రి అత్య‌వ‌స‌ర భేటీ ఆంత‌ర్య‌మేమిట‌నే అనుమానాలు ఇప్పుడు తెర‌మీదికి వ‌స్తున్నాయి. ముందస్తు బెయిలు పొందిన అవినాష్ రెడ్డిని ఈనెల 25 త‌రువాత సీబీఐ విడిచి పెట్టే అవ‌కాశాలున్నాయా..? ఒక‌వేళ అరెస్టు చేస్తే త‌లెత్తే ప‌రిణామాలు ఎలా ఉంటాయ‌నే అంశంపై ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి రాష్ట్ర డీజీపీతో చ‌ర్చించిన‌ట్లుగా పార్టీ వ‌ర్గాల నుంచి అందుతోన్న స‌మాచారం.

Also Read : Jagan : తాడేప‌ల్లిలో పోస్టుమార్టం,ఏ క్ష‌ణ‌మైన ఢిల్లీకి జ‌గ‌న్?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో నుండి చెరిగిపోకుండా ఉండేలా చ‌ర్య‌లు ఉండాల‌న్న‌దే ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి (Jagan mohan Reddy) ప్ర‌ధాన ల‌క్ష్యంగా ఉంద‌ట‌. ఆ క్ర‌మంలో కేంద్రం అండ అవ‌స‌రం. కానీ, ఇటీవ‌ల బీజేపీ పెద్ద‌లు గ‌తంలో మాదిరిగా సానుకూలంగా లేర‌ని తెలుస్తోంది. అదే విష‌యాన్ని తాజాగా సునీల్ దేవ‌ధ‌ర్ చేసిన వ్యాఖ్య‌ల‌కు పోల్చుకుంటే నిజ‌మేనేమో అనే భావ‌న క‌లుగుతోంది. ఒక వేళ వైసీపీ, బీజేపీ(YCP-BJP) బంధం తెగిపోతే మాత్రం ప్ర‌భుత్వం ప‌డిపోయే ప్ర‌మాదం కూడా ఉంద‌ని కొంద‌రు అంచ‌నా వేస్తున్నారు. తాజాగా సునీల్ దేవ‌ధ‌ర్ చేసిన వ్యాఖ్య‌లు నిజ‌మైతే, రాబోవు రోజుల్లో జ‌గన్మోహ‌న్ రెడ్డికి స‌ర్కార్ కు మూడిన‌ట్టే.

Also Read : Jagan : TDP నేత బీటెక్ ర‌వి భ‌ద్ర‌త‌కు ముప్పు, CBN ఆందోళ‌న‌